Luthra Brothers Bail Goa: గోవాలోని అర్పొరా నైట్‌క్లబ్ అగ్నిప్రమాదం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాన నిందితులుగా ఉన్న లుత్రా సోదరులకు కోర్టు బెయిల్ మంజూరు చేసినప్పటికీ, వారు జైలు నుంచి విడుదలవ్వడానికి మరో చట్టపరమైన చిక్కు వచ్చి పడింది.గతేడాది డిసెంబర్‌లో అర్పొరాలోని 'బిర్చ్ బై రోమియో' నైట్‌క్లబ్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో 25 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
ఈ కేసులో క్లబ్ యజమానులు గౌరవ్ లుత్రా, సౌరభ్ లుత్రాలను పోలీసులు అరెస్ట్ చేశారు.
Read Also:Markapuram Bus Accident: బస్సు ప్రమాదం: 14 మంది మృతికి ఆ 'పిసినారితనమే' కారణం
అడ్డంకిగా మారిన ఫోర్జరీ కేసు
అదనపు సెషన్స్ కోర్టు వీరికి బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో ఇప్పటికే చార్జిషీట్ దాఖలైనందున, నిందితులను సుదీర్ఘ కాలం కస్టడీలో ఉంచాల్సిన అవసరం లేదని ధర్మాసనం అభిప్రాయపడింది.బెయిల్ వచ్చినప్పటికీ, లుత్రా సోదరులు ఇప్పుడప్పుడే కోల్వాలే సెంట్రల్ జైలు నుండి బయటకు వచ్చే అవకాశం లేదు.నైట్‌క్లబ్ నిర్వహణకు అవసరమైన అనుమతుల కోసం వీరు నకిలీ పత్రాలను (Forgery) సృష్టించారనే ఆరోపణలపై మరో కేసు నమోదైంది. ఈ కేసులో విచారణ ఇంకా కొనసాగుతుండటంతో వీరి విడుదల నిలిచిపోయింది.
Luthra brothers forgery case update
Luthra Brothers Bail Goa: కోర్టు విధించిన కఠిన షరతులు
అగ్నిప్రమాదం కేసులో బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు పలు నిబంధనలను విధించింది. నిందితులు తమ పాస్‌పోర్ట్‌లను కోర్టుకు సమర్పించాలి. అనుమతి లేకుండా దేశం దాటి వెళ్లకూడదు.కేసులోని సాక్షులను ప్రభావితం చేయడం లేదా ఆధారాలను ధ్వంసం చేసే ప్రయత్నం చేయకూడదు.అంజునా పోలీసులు పిలిచినప్పుడు విచారణకు తప్పనిసరిగా హాజరు కావాలి.నిందితుల మొబైల్ నంబర్లు, ప్రస్తుత నివాస ధ్రువీకరణ పత్రాలను కోర్టుకు అందజేయాలని తెలిపింది..
గతేడాది డిసెంబర్ 7వ న జరిగిన ఈ అగ్నిప్రమాదం గోవా పర్యాటక రంగంలో తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. ప్రమాదం జరిగిన వెంటనే లూత్రా సోదరులు విదేశాలకు పారిపోగా.. పోలీసులు థాయ్‌లాండ్ నుంచి వారిని రప్పించి మరీ అరెస్ట్ చేశారు. నిర్లక్ష్యం, మానవ ప్రాణాలకు ముప్పు కలిగించడం వంటి సెక్షన్ల కింద వీరిపై కేసులు నమోదు చేశారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:

