Dailyhunt
నకిలీ బాబా కేసులో రాజకీయ తుఫాన్

నకిలీ బాబా కేసులో రాజకీయ తుఫాన్

వార్త 1 week ago

నకిలీ బాబా కేసుతో మహారాష్ట్రలో కలకలం

Ashok kharat fake : మహారాష్ట్రలో నాసిక్‌కు చెందిన నకిలీ బాబా అశోక్ ఖరాత్ కేసు ఇప్పుడు పెద్ద రాజకీయ దుమారాన్ని రేపుతోంది.

తాంత్రిక పూజల ముసుగులో పలువురు మహిళలపై అత్యాచారాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఖరాత్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

షిండేతో కాల్ డేటా వివాదం

ఈ కేసులో వెలుగులోకి వచ్చిన ఫోన్ కాల్ డేటా రికార్డులు మరింత సంచలనంగా మారాయి. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేతో ఈ నకిలీ బాబా పలుమార్లు ఫోన్‌లో మాట్లాడినట్లు CDR రికార్డులు సూచిస్తున్నాయని సామాజిక కార్యకర్త అంజలీ దమానియా వెల్లడించారు. గుర్తు తెలియని వాట్సాప్ నంబర్ నుంచి ఈ ఆడియోలు, కాల్ వివరాలు తనకు అందాయని ఆమె తెలిపారు.

Read Also : Virat Kohli Record: విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు!

 Ashok kharat fake

సీఎం ఫడ్నవీస్ స్పందన

ఈ వివాదంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందిస్తూ రెండు అంశాలపై దర్యాప్తు జరిపిస్తామని ప్రకటించారు. మొదటగా అశోక్ ఖరాత్ చేసిన నేరాలపై విచారణ కొనసాగుతుందని, రెండవది కాల్ డేటా రికార్డులు బయటకు ఎలా వచ్చాయన్నదానిపై కూడా విచారణ జరుగుతుందని తెలిపారు. ఈ డేటా లీక్ వెనుక ఉన్నవారిని గుర్తించేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ద్వారా విచారణ జరిపిస్తామని చెప్పారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

ట్రంప్ కు పదవి గండం ?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha