Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నకిలీ నోట్లతో పెద్ది సినిమా చూసిన ప్రేక్షకులు

నకిలీ నోట్లతో పెద్ది సినిమా చూసిన ప్రేక్షకులు

వార్త 2 months ago

Peddi Movie: పల్నాడు జిల్లా నరసరావుపేటలో దొంగ నోట్ల చలామణి కలకలం రేపింది. నగరంలోని ప్రముఖ 'కాసు మల్టీప్లెక్స్' థియేటర్‌లో కొందరు నిందితులు నకిలీ కరెన్సీ నోట్లను మార్పిడి చేసిన ఉదంతం వెలుగుచూసింది.

థియేటర్‌లో టికెట్లు, స్నాక్స్ కౌంటర్ల వద్ద రద్దీగా ఉన్న సమయాన్ని ఆసరాగా చేసుకుని, కొందరు కేటుగాళ్లు దొంగ నోట్లను చొప్పించినట్లు సమాచారం.

Read Also : Alia Bhatt Alpha Movie Teaser:'ఆల్ఫా'గా అలియా భట్ యాక్షన్ విధ్వంసం.. వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ ప్రోమో అవుట్!

 Audience watched the movie ‘Peddi’ using counterfeit notes.

Peddi Movie: రద్దీ సమయంలో నకిలీ నోట్ల చలామణి

కాసు మల్టీప్లెక్స్ థియేటర్‌కు పెద్ద సినిమా చూసేందుకు ప్రేక్షకులు భారీగా తరలివచ్చారు. కౌంటర్ల వద్ద జనం విపరీతంగా ఉన్న సమయంలో కొందరు ప్రేక్షకులు నకిలీ నోట్లు ఇచ్చి టికెట్లు, ఇతర తినుబండారాలు కొనుగోలు చేశారు. క్యాష్ కౌంటర్ సిబ్బంది రద్దీ ఆరాటంలో గమనించకపోవడంతో ఈ దొంగ నోట్లు లోపలికి వచ్చాయి. ఆ తర్వాత లెక్కలు సరిచూసుకునే సమయంలో నకిలీ నోట్లు ఉన్నట్లు థియేటర్ యాజమాన్యం గుర్తించి షాక్‌కు గురైంది.

నిందితుల కోసం ఆరా.. పోలీసుల హెచ్చరిక

ఈ నకిలీ నోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరు వీటిని థియేటర్ కౌంటర్లలో ఇచ్చారు? అనే అంశాలపై థియేటర్ యాజమాన్యం అంతర్గతంగా ఆరా తీస్తోంది. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నిందితులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై స్పందించిన స్థానిక పోలీసులు వ్యాపారులు, సాధారణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ముఖ్యంగా రద్దీ సమయాల్లో నగదు తీసుకునేటప్పుడు నోట్లను క్షుణ్ణంగా పరిశీలించాలని, అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

బాలకృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha