Dailyhunt
నల్లవల్లిలో 'సర్పంచ్ భర్త పాలన'పై మండిపడుతున్న సభ్యులు

నల్లవల్లిలో 'సర్పంచ్ భర్త పాలన'పై మండిపడుతున్న సభ్యులు

వార్త 5 days ago

ధికార వ్యవస్థను పక్కన పెట్టి అనధికార జోక్యం అంటూ విమర్శలు

అభివృద్ధి పనుల్లో అవకతవకలపై తీవ్ర అనుమానాలు

Gummadidala Mandal: గుమ్మడిదల మండలం నల్లవల్లి గ్రామపంచాయతీలో అధికార వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందన్న ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి.

ప్రజల చేత ఎన్నుకోబడిన సర్పంచ్ స్థానాన్ని పక్కనబెట్టి, ఆమె భర్తే గ్రామ పరిపాలనను నియంత్రిస్తున్నాడన్న విమర్శలు రోజురోజుకీ ముదురుతున్నాయి. ఈ పరిస్థితులపై ఆగ్రహంతో ఉన్న వార్డు సభ్యులు ముందుకు వచ్చి తమ అసంతృప్తిని వెల్లగక్కారు.సర్పంచ్ కొరివి రాణి పేరును ముసుగుగా ఉపయోగించుకుని, ఆమె భర్త సురేష్ స్వేచ్ఛాచారంగా వ్యవహరిస్తున్నాడని సభ్యులు మండిపడ్డారు. కీలక నిర్ణయాలు తీసుకునే సమయంలో పాలకవర్గాన్ని పూర్తిగా పక్కనబెట్టి, ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

Read Also: Bejjanki: పందుల బెడద నుండి కాపాడండి: గ్రామస్తులు

ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ సభ్యుల అభిప్రాయాలను పూర్తిగా విస్మరిస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు.సభ్యులను అవమానించే విధంగా ప్రవర్తిస్తున్నారని, గ్రామ సమస్యలపై ప్రశ్నలు అడిగినా పట్టించుకోకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఈ తీరును ఇకపై సహించబోమని స్పష్టం చేస్తూ, అవసరమైతే పెద్ద స్థాయిలో పోరాటానికి సిద్ధమని హెచ్చరించారు.ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న అంగన్వాడీ భవనం అంశాన్ని ప్రస్తావిస్తూ, చిన్నారుల భవిష్యత్తును పణంగా పెట్టేలా నిర్ణయాలు తీసుకోవడం అన్యాయమని పేర్కొన్నారు.

Gummadidala Mandal: నిధుల వినియోగంలో అపారదర్శకత

మహిళా సంఘం భవనం కోసం కేటాయించిన స్థలంలోనే అంగన్వాడీ నిర్మాణం చేపట్టాలని తమ విజ్ఞప్తిని పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.ఇంకా అభివృద్ధి పేరుతో జరుగుతున్న పనులపై కూడా తీవ్ర అనుమానాలు వ్యక్తం చేశారు. 8వ వార్డులో కేవలం రూ.5 లక్షల డ్రైనేజీ పనుల కోసం రూ.20 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును ధ్వంసం చేయడం వెనుక అసలు ఉద్దేశం ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు.గ్రామ నిధుల వినియోగం పూర్తిగా అపారదర్శకంగా మారిందని, పనులు ప్రారంభించే ముందు పాలకవర్గానికి కనీస సమాచారం ఇవ్వడం లేదని ఆరోపించారు.

ఇటీవల ఎమ్మెల్యే నిధులతో నిర్వహించిన కార్యక్రమాలకు సభ్యులను ఆహ్వానించకపోవడం కూడా అధికార దుర్వినియోగానికి నిదర్శనమని విమర్శించారు.ఇకపై గ్రామాభివృద్ధి కార్యక్రమాల్లో పాలకవర్గానికి తగిన గౌరవం, ప్రాధాన్యత ఇవ్వకపోతే తీవ్రమైన పరిణామాలు తప్పవని సభ్యులు కఠిన హెచ్చరికలు జారీ చేశారు. గ్రామ ప్రజల హక్కులను కాపాడేందుకు అవసరమైతే పోరాటానికి వెనుకాడబోమని స్పష్టం చేశారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

కానుకుంట గ్రామంలో తల్లి తండ్రుల జ్ఞాపకార్థంగా చలివేంద్రం ఏర్పాటు: కె ఎస్ జి యువసేన సుధాకర్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha