Dailyhunt
పందుల బెడద నుండి కాపాడండి: గ్రామస్తులు

పందుల బెడద నుండి కాపాడండి: గ్రామస్తులు

వార్త 5 days ago

Bejjanki: బెజ్జంకి మండల కేంద్రంలో పందుల బెడద నుండి కాపాడాలని బెజ్జంకి గ్రామ ప్రజలు తహసిల్దార్ శ్రీకాంత్, ఎంపీడీవో ప్రవీణ్, ఎస్సై బోయిని సౌజన్య,సర్పంచ్ బొల్లం శ్రీధర్ పెద్దన్న గారికి గ్రామస్తులు వినతి పత్రాలు అందించారు పందులను విచ్చలవిడిగా విడిచి పెట్టడం ద్వారా నేరుగా ఇళ్లలోకి ప్రవేశించి తీవ్ర ఇబ్బందులు కలగజేస్తున్నా యి,అవి వెదజల్లే తీవ్రమైన దుర్వాసన ద్వారా ప్రజలు అనారోగ్యాల పాలవుతున్నారు, పంట పొలాలను సైతం నాశనం చేస్తూ జీవనాధారాన్ని దెబ్బతీస్తున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.ఈ పందుల పెంపకం దారులపై వెంటనే చర్యలు తీసుకొని పంట పొలాలను మరియు గ్రామ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ దుమాల మహేష్ వార్డ్ సభ్యులు తిప్పారపు మహేష్, సతీష్, శివకృష్ణ మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha