Medak News: నా వార్డులో పక్కా వార్డ్ కౌన్సిలర్ కు ఏం పని నేను ప్రజల మద్దతు తో కౌన్సిలర్ గా గెలిచాను . నా వార్డ్ అభివృద్ధికి నన్ను పని చేయకుండా అధికారులు కొంత మంది నాయకులు ఇబ్బందులకు గురిచేస్తున్నారు.
నా వార్డ్ లు నిధులు ఇవ్వకపోయినా నా వార్డ్ లో వేరే వాళ్ళు పెత్తనం చేసిన నేను మీ అందరి పేర్లు రాసి చనిపోతా అని ఒక మహిళ కౌన్సిలర్ మున్సిపల్ సర్వ సభ్య సమావేశంలో కౌన్సిల సాక్షిగా తన ఆవేదనను వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే మంగళవారం జిల్లా కేంద్రం అయిన మెదక్ మున్సిపల్ సర్వ సభ్య సమావేశం మెదక్ మున్సిపల్ కార్యాలయం లో చైర్మన్ కానుగు రాధిక అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణం లోని 17 వార్డు కౌన్సిలర్ పాల అరుణసిద్ధిరాములు మాట్లాడుతూ తన వార్డ్ కు నిధులు ఇవ్వకుండా నన్ను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు.
Medak Woman Councilor’s Distress
Medak Woman Councilor’s Distress
Medak News: అధికారుల వైఖరిపై కౌన్సిలర్ తీవ్ర హెచ్చరిక
అంతేకాకుండా తన వార్డ్ లో తాము చేసిన పనులను ఇతరులు చేసినట్టు చెప్పుకుంటున్నారాన్నారు. వార్డ్ కౌన్సిలర్ గా నేను ఉన్న తరువాత ఇతరులకు ఏం పని అని ప్రశ్నించారు. తమ వార్డ్ లో జరిగే ఏ కార్యక్రమం అయినా అధికారులు తనకు సమాచారం ఇవ్వడంలేదన్నారు. ఇదే పద్ధతి కొనసాగితే తాను అందరి పేరులు రాసి చనిపోతాను అని అవేదన వ్యక్తం చేశారు. వెంటనే స్పందించిన చైర్పర్సన్ కానుగు రాధిక మాట్లాడుతూ అలా ఏం జరగకుండా చూస్తామని అభివృద్ధి నిధులు అన్ని వార్డ్ \లకు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. అంతే కాకుండా అధికారులు ఏ సమాచారం ఇవ్వక పోయినా తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం కౌన్సిలర్ అరుణ మాట్లాడుతూ మళ్లీ ఇలా జరిగితే సహించేది లేదన్నారు. ఆమె అధికార పార్టీ కౌన్సిలర్ కావడం కొసమెరుపు. సొంత పార్టీ నాయకుల పైనే వివక్ష కొనసాగితే ప్రతిపక్ష పార్టీ ప్రతినిధుల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.


Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

