Narsapur: నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలో తెలంగాణ రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగారాలు, గనులు మరియు భూగర్భ శాస్త్ర మంత్రిత్వ శాఖల మరియు మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రి వర్యులు డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి శనివారం విస్తృతంగా పర్యటించారు.
ఈ సందర్భంగా నర్సాపూర్ శాసనసభ్యులు సునీత లక్ష్మారెడ్డి, పట్టభద్రుల ఎమ్మెల్సీ అంజిరెడ్డి ,జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ , మున్సిపల్ చైర్ పర్సన్ లక్ష్మీ రాజ యాదవ్ , గ్రంధాలయ చైర్మన్ చిలె మల సుహాసినిరెడ్డి, మెదక్ ఆర్డీవో రమాదేవి, నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జి ఆవుల రాజి రెడ్డి ప్రజా ప్రతినిధులతో కలిసి, మంత్రి పాల్గొన్నారు మొదటిగా నగర అభివృద్ధి పథకం కింద నర్సాపూర్ మున్సిపాలిటీ లో 15 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మ రెడ్డి తో మెదక్ కలెక్టర్ ప్రతిమ సింగ్ తో కలిసి మంత్రి వివేక్ వెంకటస్వామి శంకుస్థాపన చేశారు….
Read Also: Congress Reaction on Kavitha Party:ఇది బీఆర్ఎస్ తోక పార్టీ: రామ్మోహన్ రెడ్డి
పర్యటనలో భాగంగా మంత్రి నర్సాపూర్ 04,,06 వ వార్డులలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు వార్డ్ (4th) దుద్దాల దుర్గమ్మ భర్త అశోక్ 6th వార్డు మహమ్మద్ షకీరా బేగం భర్త యూసఫ్ ఉద్దీన్ గృహప్రవేశ కార్యక్రమాల్లో పాల్గొని, పూజలు నిర్వహించి లబ్ధిదారులతో కలిసి గృహాలను ప్రారంభించారు. అనంతరం నారాయణపూర్ గ్రామంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమ సంక్షేమ వారోత్సవాల్లో భాగంగా బడిబాట కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు.


ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, నర్సాపూర్ పట్టణ అభివృద్ధికి ప్రత్యేక మున్సిపల్ సమావేశం ఏర్పాటు చేసి సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్లు సూచించారు. . మున్సిపాలిటీ నగరాభివృద్ధికి రూ.15 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ప్రజల శ్రేయస్సే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, రాజకీయాలకు అతీతంగా అందరికీ సమానంగా అభివృద్ధి ఫలాలు అందేలా కృషి చేయాలని సూచించారు. వేసవి కాలంలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్, కౌన్సిలర్లు ప్రతిరోజూ సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజలతో నిత్యం ఉంటూ ఉదయం, సాయంత్రం సమయం కేటాయిస్తే మంచి ఫలితాలు సాధ్యమవుతాయని తెలిపారు.
Narsapur: Narsapur Municipality allocates Rs. 15 crore for the development of the city
ప్రజా ప్రభుత్వం నిరంతరం ప్రజల కోసం పని చేస్తుందని, ప్రతి ప్రజాప్రతినిధి బాధ్యతగా ప్రజలకు సేవ చేయాలని మంత్రి కోరారు. కొత్తగా ఎన్నికైన సభ్యులు అధికారులతో సమన్వయం చేసుకొని సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందించే విధంగా విద్యావ్యవస్థను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటుందని మంత్రి తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య ఉచితంగా అందిస్తున్నామని నమోదు పెంచుకోవాలని ఆ దిశలో జరిగే బడిబాట కార్యమాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తాహసిల్దారులు, జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also :
ప్రభుత్వ బడి విద్యార్థుల తల్లిదండ్రులకు గుడ్ న్యూస్.. ఫోన్లకే వార్షిక ప్రోగ్రెస్ కార్డులు

