Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ప్రభుత్వ బడి విద్యార్థుల తల్లిదండ్రులకు గుడ్ న్యూస్.. ఫోన్లకే వార్షిక ప్రోగ్రెస్ కార్డులు

ప్రభుత్వ బడి విద్యార్థుల తల్లిదండ్రులకు గుడ్ న్యూస్.. ఫోన్లకే వార్షిక ప్రోగ్రెస్ కార్డులు

వార్త 2 months ago

Telangana: తెలంగాణ ప్రభుత్వం డిజిటల్ పాలనలో మరో కీలక మైలురాయిని అధిగమించింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల విద్యా ప్రగతిని తల్లిదండ్రులకు మరింత చేరువ చేసేందుకు 'వాట్సాప్'ను వేదికగా చేసుకుంది.

5వ తరగతి నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల వార్షిక ప్రోగ్రెస్ కార్డులను నేరుగా తల్లిదండ్రుల మొబైల్ ఫోన్లకు పంపించే ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసింది.

Read Also: Congress Reaction on Kavitha Party:ఇది బీఆర్ఎస్ తోక పార్టీ: రామ్మోహన్ రెడ్డి

 Telangana Education Department

Telangana: విద్యా వ్యవస్థలో సరికొత్త పారదర్శకత

ఐటీ శాఖ ఆధ్వర్యంలోని మీసేవ సేవల ద్వారా 18 లక్షల మందికి పైగా విద్యార్థుల ప్రోగ్రెస్ కార్డులు జారీ అయ్యాయి. అయితే, ఈ విధానం వల్ల విద్యార్థుల ప్రగతిని తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించే వీలుంటుంది. పాఠశాలలకు వెళ్లే శ్రమ తగ్గడమే కాకుండా, కాగిత రహిత (Paperless) విధానాన్ని ప్రోత్సహించినట్లయింది. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు, ఇలాంటి అత్యాధునిక సాంకేతిక సేవలను అందుబాటులోకి తీసుకురావడం పట్ల విద్యావేత్తలు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఈ డిజిటల్ ముందడుగు దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవనుంది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

పెట్రోల్, డీజిల్ కొరత.. బంకుల ముందు నో స్టాక్ బోర్డులు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha