Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నర్సంపేటలో బీఆర్‌ఎస్ రాస్తారోకో.. పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహ గద్దె కూల్చివేతపై నిరసన

నర్సంపేటలో బీఆర్‌ఎస్ రాస్తారోకో.. పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహ గద్దె కూల్చివేతపై నిరసన

వార్త 2 weeks ago

BRS Protest In Narsampet: నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి స్మారకంగా విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు నిర్మించిన గద్దెను మున్సిపల్ అధికారులు కూల్చివేయడాన్ని నిరసిస్తూ బీఆర్‌ఎస్ నాయకులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ చర్యకు నిరసనగా సోమవారం నర్సంపేట పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద బీఆర్‌ఎస్ ముఖ్య నాయకుల ఆధ్వర్యంలో భారీ రాస్తారోకో, ధర్నా చేపట్టారు. గద్దె కూల్చివేతను తీవ్రంగా ఖండిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వానికి, అధికారులకు వ్యతిరేకంగా పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

Read Also : Medico Priyanka Death: మెడికో ప్రియాంక మృతి.. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలన్న తెలంగాణ ప్రభుత్వం

 BRS stages road blockade in Narsampet; protest against the demolition of Peddi Sudarshan Reddy’s statue pedestal.

BRS Protest In Narsampet: వినోద్ కుమార్, ఎర్రబెల్లి ఆధ్వర్యంలో నిరసన: పాల్గొన్న పార్టీ శ్రేణులు

మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆందోళన కార్యక్రమంలో నియోజకవర్గానికి చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజల మద్దతు పొందిన దివంగత నేత పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహ గద్దెను కూల్చివేయడం సరికాదని, ప్రజల మనోభావాలను గౌరవించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నియోజకవర్గ కన్వీనర్ తక్కళ్లపల్లి రవీందర్‌రావు, జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, నాయకులు రాయిడి రవీందర్ రెడ్డి, వంగేటి అశోక్ కుమార్, శెంకెశి కమలాకర్ తదితరులు పాల్గొన్నారు. రాస్తారోకో కారణంగా అంబేద్కర్ సెంటర్ వద్ద కొంతసేపు ట్రాఫిక్ స్తంభించింది.

హైడ్రా ఉద్యోగాల గడువు పెంపు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha