Stock market: అమెరికా, ఇరాన్ దేశాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం ఒక్కసారిగా రద్దయింది. ఈ పరిణామంతో పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లలో ఆందోళన మొదలైంది.
దీని ప్రభావం మన దేశీయ మార్కెట్లపై బలంగా పడటంతో ఈరోజు ట్రేడింగ్ ప్రారంభంలోనే సూచీలు భారీ నష్టాలను చవిచూశాయి.
Read also: Petrol, Diesel: సామాన్యుడిపై భారం పడకుండా పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్రం కీలక నిర్ణయం
Stock market falling red graph screen
Stock market: కుప్పకూలిన సెన్సెక్స్.. బేజారైన ఇన్వెస్టర్లు
నేటి ఉదయం సెషన్‌లో బెంచ్‌మార్క్ సూచీలు దాదాపు 0.7 శాతం మేర కిందకు పడిపోయాయి. సెన్సెక్స్ 500 పాయింట్లకు పైగా క్షీణించి 77,291 వద్ద కొనసాగుతుండగా, నిఫ్టీ కూడా 168 పాయింట్లు నష్టపోయి 24,158 స్థాయికి చేరుకుంది. మార్కెట్ ఒక్కసారిగా పతనం కావడంతో షేర్ హోల్డర్లు భారీగా సంపదను కోల్పోవాల్సి వచ్చింది.
పశ్చిమాసియా సెగతో కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు
ముఖ్యంగా బ్యాంకింగ్, ఆటోమొబైల్, ఆయిల్ అండ్ గ్యాస్ వంటి ప్రధాన రంగాల్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరిగే అవకాశం ఉండటంతో చమురు కంపెనీల షేర్లు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నాయి. యుద్ధ భయాల నేపథ్యంలో మార్కెట్ మరికొన్ని రోజులు ఇలాగే ఒడుదొడుకులకు లోనయ్యే అవకాశం కనిపిస్తోంది.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

