Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'వంద దేవుళ్ళు' సినిమా రివ్యూ

'వంద దేవుళ్ళు' సినిమా రివ్యూ

వార్త 2 weeks ago

Vanda Devullu Review: 'బిచ్చగాడు' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరయ్యాడు తమిళ నటుడు విజయ్‌ ఆంటోని. ఆ సినిమా తెచ్చిపెట్టిన క్రేజ్‌తో ఆ తర్వాత ఆయన నటించిన పలు చిత్రాలు తెలుగులో విడుదలైనప్పటికీ, ఆ స్థాయి విజయాన్ని మాత్రం అందుకోలేకపోయాయి.

అయితే, చాలా కాలం తర్వాత మళ్లీ ‘బిచ్చగాడు’ దర్శకుడు శశితో జతకట్టి, అదే తరహా ‘అమ్మ’ సెంటిమెంట్‌తో ఆయన చేసిన తాజా చిత్రమే ‘వంద దేవుళ్ళు’. ఈ శుక్రవారం థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించింది? విజయ్ ఆంటోనికి సరైన సక్సెస్ అందించిందా? రివ్యూలో చూద్దాం.

 Vijay Antony

Read also:Maa Inti Bangaram Twitter Review: సమంత 'మా ఇంటి బంగారం' ఫస్ట్ డే టాక్.. నెటిజన్లు ఏమంటున్నారంటే?

అసలు కథేంటంటే?

భర్త చనిపోవడంతో ఒంటరిదైన వాసవి (శ్వాసిక) కూలీ పని చేస్తూ తన ఇద్దరు కొడుకులను ఎంతో కష్టపడి చదివిస్తుంది. సమాజంలో ఒక ఒంటరి మహిళ ఎదుర్కొనే అవమానాలు, కష్టాలను భరిస్తూనే పిల్లలను ఉన్నత స్థానంలో నిలబెడుతుంది. అయితే ఊరి జనం మాట్లాడే సూటిపోటి మాటలు భరించలేక, ఈ అవమానాల నుంచి విముక్తి పొందాలంటే మళ్లీ పెళ్లి చేసుకోవడమే సరైన మార్గమని భావిస్తుంది.

తమ టీచర్ ద్వారా తల్లి తీసుకున్న ఈ నిర్ణయం గురించి తెలుసుకున్న పెద్ద కొడుకు తీవ్రంగా మండిపడతాడు. చిన్న కొడుకు కూడా మొదట్లో తల్లి పెళ్లిని తప్పుబడతాడు. అసలు కొడుకులు ఇద్దరూ అమ్మ నిర్ణయాన్ని ఎందుకు వ్యతిరేకించారు? ఆ తర్వాత వారి ఆలోచనలో ఎలాంటి మార్పు వచ్చింది? చివరికి ప్రాణాలకు తెగించి మరీ ఊరి పెద్దలతో ఫైట్ చేసి అమ్మకు పెళ్లి చేయడానికి ఎందుకు సిద్ధపడ్డారు? ఈ కథలోకి ఏడుకొండలు (విజయ్ ఆంటోని) ఎలా వచ్చాడు? వాసవి, ఏడుకొండల వివాహం జరిగిందా? లేదా? అనేదే మిగిలిన సినిమా.

విశ్లేషణ: కథనం ఎలా సాగింది?

“అమ్మ కూడా ఒక మనిషే.. ఆమెకూ ఒక జీవితం, మనసు ఉంటాయి. పిల్లల కోసమే ఆమె జీవితాన్ని పూర్తిగా త్యాగం చేయాల్సిన పనిలేదు” అనే ఒక మంచి సామాజిక సందేశంతో దర్శకుడు శశి ఈ చిత్రాన్ని రూపొందించారు. ముఖ్యంగా పల్లెటూరి కట్టుబాట్ల పేరుతో ఎంతోమంది ఒంటరి మహిళల జీవితాలు ఎలా అర్ధాంతరంగా ముగిసిపోతున్నాయనే పాయింట్‌ను ఇందులో చక్కగా చూపించారు.

ఒంటరి తల్లిగా వాసవి పడే ఆవేదన, అమ్మ-కొడుకుల మధ్య ఉండే అనుబంధం ప్రేక్షకులను కథలో లీనం చేస్తాయి. కథనం కొంచెం నెమ్మదిగా సాగినప్పటికీ, ఎమోషన్స్ బాగా పండటంతో ఆ ఫీల్ కనెక్ట్ అవుతుంది. ప్రథమార్థంలో కొన్ని సాగదీత సీన్లు, బోర్ కొట్టించే అంశాలు ఉన్నప్పటికీ.. ద్వితీయార్థంలో కొడుకు వివేక్ తన తల్లి పెళ్లి కోసం చేసే ప్రయత్నాలు, ఏడుకొండలు పాత్ర ఎంట్రీతో కథ ఆసక్తికరంగా మారుతుంది.

ఏడుకొండలు, వాసవి మధ్య వచ్చే సన్నివేశాలు చాలా హాయిగా, క్యూట్‌గా అనిపిస్తాయి. గతంలో తెలుగులో వచ్చిన ‘మా నాన్నకి పెళ్లి’ సినిమాను ఇది గుర్తుకు తెస్తుంది. అయితే అక్కడ తండ్రి పెళ్లి చుట్టూ కథ తిరిగితే, ఇక్కడ తల్లి పెళ్లి నేపథ్యంలో సాగుతుంది. క్లైమాక్స్ సీన్లలో పేజీల కొద్దీ భారీ డైలాగులతో క్లాస్ పీకకుండా, సింపుల్‌గా ఎంటర్‌టైనింగ్ వేలో ముగించడం బాగుంది. కాకపోతే కథలో మరింత బలం ఉండి ఉంటే సినిమా రేంజ్ ఇంకోలా ఉండేది.

Vanda Devullu Review: ఎవరెలా చేశారంటే?

ఈ సినిమాకు ప్రధాన బలం వాసవి పాత్రలో నటించిన శ్వాసిక. ఒక ఒంటరి తల్లిగా, ఆవేదన చెందే మహిళగా ఆమె అద్భుతమైన నటన కనబరిచింది. డైలాగ్స్ కంటే ఆమె కళ్ళలోనే హావభావాలు పలికించి మెప్పించింది. ఇక విజయ్ ఆంటోని (ఏడుకొండలు) పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ, ఉన్నంతలో తన మార్క్ నటనతో ఆకట్టుకున్నాడు. కొడుకులుగా చేసిన భాస్కర్, దీషన్ తమ పరిధి మేర బాగానే చేశారు. మిగిలిన నటీనటులు ఓకే అనిపించారు. పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కథ మూడ్‌కు తగ్గట్టుగా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ పర్వాలేదు.

‘బిచ్చగాడు’ రేంజ్ హైప్ ఆశించి వెళ్తే ఈ సినిమా కొద్దిగా నిరాశ పరచవచ్చు. కానీ, నెమ్మదిగా సాగే కథనాన్ని పక్కన పెడితే.. ప్యూర్ ఫ్యామిలీ ఎమోషన్స్, అమ్మ సెంటిమెంట్‌ను ఇష్టపడే ప్రేక్షకులకు ‘వంద దేవుళ్ళు’ ఒక మంచి అనుభూతిని ఇస్తుంది.

బాలయ్య NBK111 లో కాజల్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha