Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నటి తాన్యా ఛటర్జీపై యజువేంద్ర చాహల్ పరువు నష్టం దావా

నటి తాన్యా ఛటర్జీపై యజువేంద్ర చాహల్ పరువు నష్టం దావా

వార్త 2 months ago

Chahal vs Tanya: టీమిండియా క్రికెటర్ యజువేంద్ర చాహల్ మరియు నటి తాన్యా ఛటర్జీల మధ్య చెలరేగిన సోషల్ మీడియా వార్ ఇప్పుడు న్యాయపోరాటానికి దారితీసింది.

తన ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరించినందుకు గాను, తాన్యాపై చాహల్ పరువు నష్టం దావా వేశారు. కేవలం ఒక వీడియోతో మొదలైన ఈ గొడవ, ఇప్పుడు ఇద్దరు సెలబ్రిటీల మధ్య చట్టపరమైన వివాదనికి దారితీసింది.

వివాదానికి కారణం ఇదే..

ఒక ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న తాన్యా ఛటర్జీ, చాహల్ తనకు ఇన్‌స్టాగ్రామ్‌లో సందేశాలు పంపాడంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. అంతటితో ఆగకుండా తన ఫోన్‌లోని చాట్‌లను కెమెరాల ముందు ప్రదర్శించడంతో ఆ వీడియో క్షణాల్లో వైరల్ అయ్యింది. ఇది కాస్తా చాహల్ వ్యక్తిగత జీవితంపై, క్రీడా ప్రతిష్టపై విమర్శలకు దారి తీసింది. దీనిపై తాన్యా స్పందిస్తూ.. ఆ వీడియో అంతలా వైరల్ అవుతుందని తాను ఊహించలేదని, తనపై దావా వేయడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేస్తోంది.

Read Also: SRH vs CSK: పోలీసుల భారీ భద్రత.. ఈ వస్తువులకు అనుమతి లేదు!

 Chahal’s sensational decision: lawsuit against actress.

Chahal vs Tanya: న్యాయపోరాటం బాటలో చాహల్

తాన్యా చేసిన వ్యాఖ్యలు తనను తప్పుగా చిత్రీకరిస్తున్నాయని, దీనివల్ల తన కెరీర్‌కు నష్టం వాటిల్లుతుందని భావించిన చాహల్ వెంటనే చట్టపరమైన చర్యలు చేపట్టారు. ఒక చిన్న అంశాన్ని పబ్లిసిటీ కోసం వాడుకున్నారని ఆయన తరపు వర్గాలు భావిస్తున్నాయి. అటు నెటిజన్లు కూడా ఈ విషయంలో రెండుగా విడిపోయారు. కొందరు చాహల్‌ను ట్రోల్ చేస్తుండగా, మరికొందరు తాన్యా కేవలం పాపులారిటీ కోసమే ఇలా చేసిందని విమర్శిస్తున్నారు.

తాన్యా ఛటర్జీ నేపథ్యం

కోల్‌కతాకు చెందిన తాన్యా ఛటర్జీ ప్రముఖ మోడల్, నటి. ఆమె ముఖ్యంగా డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లపై గుర్తింపు తెచ్చుకుంది. 'గందీ బాత్' సీజన్ 4తో పాటు 'ఉఠా పటక్', 'జాల్', 'కసక్' వంటి వెబ్ సిరీస్‌లలో నటించి పాపులర్ అయ్యింది. నిరంతరం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే తాన్యా, ఇప్పుడు ఈ వివాదంతో దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. ఈ కేసు తదుపరి విచారణలో ఎలాంటి మలుపులు తిరుగుతుందోనని అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్: ఆర్‌సీబీ బ్యాటింగ్.. చిన్నస్వామిలో పరుగుల వర్షం ఖాయమేనా?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha