MRP Movie Teaser: టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ప్రస్తుతం క్రైమ్ కామెడీలకు మంచి ఆదరణ లభిస్తోంది. ఆ కోవలోనే నరేష్ అగస్త్య, రాజ్ కుమార్ కసిరెడ్డి, సుదర్శన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న 'MRP: నీకెంత?
నాకెంత?’ సినిమా టీజర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Read Also:YS Jagan: సినీ నిర్మాత త్రిపురనేని చిట్టిబాబు మృతి: వైఎస్ జగన్ సంతాపం
MRP Movie Teaser: టీజర్ హైలైట్స్
సీనియర్ నటుడు వెన్నెల కిషోర్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషించడంతో వినోదం ఏ రేంజ్‌లో ఉంటుందో ఊహించుకోవచ్చు.నరేష్ అగస్త్య, రాజ్ కుమార్ కసిరెడ్డి మరియు సుదర్శన్ ముగ్గురూ స్నేహితులుగా కనిపిస్తున్నారు.చిత్రం టీజర్ చూస్తే వినోదంతో నిండిన వినూత్న కథను చూపించబోతుందనే భావన కలుగుతోంది.
ముగ్గురు యువకుల చుట్టూ తిరిగే కథ, వారి మధ్య ఉండే సరదా సంఘటనలు, స్టైలిష్ మేకింగ్ టీజర్‌కు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి.ఈ చిత్రానికి శ్రవణ్ జేష్ఠ దర్శకత్వం వహిస్తూ నిర్మాణ బాధ్యతలు కూడా చేపట్టారు. టీజర్‌లో కనిపించిన ఎనర్జీ, ప్రెజెంటేషన్ సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి.అజయ్ అరసాడ సంగీతం అందించగా, విజువల్స్‌కి మరింత ఆకర్షణను తీసుకొచ్చింది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:
ఐకాన్ స్టార్ 'డ్రీమ్ హౌస్'.. జూబ్లీహిల్స్‌లో రూ. 80 కోట్లతో రాజభవనం!

