CSK vs MI: క్రికెట్ అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ (CSK, ముంబై ఇండియన్స్ (MI) పోరు నేడు చెపాక్ స్టేడియంలో జరగనుంది.
ఈ ఎపిక్ రైవల్ట్రీలో టీమిండియా దిగ్గజాలు ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మలు ఆడతారా లేదా అనే ఉత్కంఠకు ఇరు జట్ల కోచ్‌లు తెరలేపారు.
Read Also:KL Rahul: కేఎల్ రాహుల్ 'సిక్సర్ల' సెన్సేషన్: IPLలో తొలి ఇండియన్ ఓపెనర్‌గా రికార్డు
CSK vs MI: హిట్‌మ్యాన్ వస్తున్నాడు!
ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ మహేల జయవర్ధనే మాట్లాడుతూ.. రోహిత్ శర్మ గాయం నుంచి కోలుకున్నాడని ఒక శుభవార్త చెప్పారు. అయితే, మెడికల్ టీమ్ అతనిని నిరంతరం పర్యవేక్షిస్తోందని, మ్యాచ్ ప్రారంభానికి ముందే తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. రోహిత్ పూర్తి ఫిట్‌గా ఉంటేనే బరిలోకి దించుతామని స్పష్టం చేశారు.
ధోనీపై సస్పెన్స్
మరోవైపు చెన్నై హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్, ధోనీ గురించి స్పందిస్తూ.. ప్రస్తుతం ధోనీ బాగున్నాడని, ప్రాక్టీస్ కూడా చేస్తున్నాడని తెలిపారు. అయితే ముంబైతో నేడు జరిగే మ్యాచ్‌లో ఆడతాడా లేదా అనే విషయంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. 44 ఏళ్ల వయసులో పాత గాయం వేధిస్తున్నప్పటికీ, ధోనీ తన బ్యాటింగ్, కీపింగ్ నైపుణ్యాలతో సిద్ధంగా ఉన్నాడని ఫ్లెమింగ్ పేర్కొన్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:
హైదరాబాద్ ఆటోలో క్లాసెన్ షికారు.. 'కాటేరమ్మ కొడుకు' సింప్లిసిటీ చూశారా?

