SRH vs RCB: ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా మే 22న ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగనున్న ఎస్‌ఆర్‌హెచ్, ఆర్సీబీ మ్యాచ్ టికెట్లకు ఊహించని డిమాండ్ ఏర్పడింది.
‘కింగ్’ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చూడటానికి తెలుగు రాష్ట్రాల అభిమానులు ఎగబడటంతో, గురువారం టికెట్లు ఓపెన్ చేసిన నిమిషాల్లోనే హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి.గురువారం సాయంత్రం 5 గంటలకు అధికారిక బుకింగ్ యాప్ ద్వారా టికెట్ల విక్రయాలు ప్రారంభం కాగా, అద్భుతమైన రికార్డ్ నమోదైంది.
Read Also: LSG vs CSK: టాస్ గెలిచిన లక్నో సూపర్ జయంట్స్
బుకింగ్స్ మొదలైన కొద్ది నిమిషాల వ్యవధిలోనే ఏకంగా 6 లక్షల మందికి పైగా అభిమానులు ఆన్‌లైన్ వెయిటింగ్ లిస్ట్‌లో క్యూ కట్టారు. ఇంత భారీ సంఖ్యలో యూజర్లు ఒకేసారి లాగిన్ అవ్వడంతో సర్వర్లు మొరాయించాయి. గంటల తరబడి స్క్రీన్ల వైపు చూసినా ‘సోల్డ్ అవుట్’ (Sold Out) అని బోర్డులు పడటంతో సామాన్య ఫ్యాన్స్‌కు తీవ్ర నిరాశే మిగిలింది.
SRH vs RCB Match Tickets Uppal
SRH vs RCB: టికెట్ల ధరల పెంపుపై అభిమానుల అసహనం
మరోవైపు, ఈ మ్యాచ్ క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు ఎస్‌ఆర్‌హెచ్ యాజమాన్యం టికెట్ల ధరలను భారీగా పెంచిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.గత సాధారణ మ్యాచ్‌లకు రూ. 750 గా ఉన్న కనీస గ్యాలరీ టికెట్ ధరను, ఆర్సీబీ మ్యాచ్ కోసం ఏకంగా రూ. 1,750 (రూ. 1000 అదనంగా) కు పెంచినట్లు సమాచారం. మిగతా కార్పొరేట్, ప్రీమియం బాక్సుల ధరలు కూడా ఆకాశాన్ని తాకాయి.డిమాండ్ ఉంది కదా అని క్రికెట్‌ను వ్యాపారంగా మార్చవద్దంటూ నెటిజన్లు ఎస్‌ఆర్‌హెచ్ ఫ్రాంచైజీని సోషల్ మీడియా వేదికగా నిలదీస్తున్నారు. స్థానిక సామాన్య అభిమానులను దూరం చేసేలా ఈ ధరల నిర్ణయం ఉందని మండిపడుతున్నారు.మే 22న జరగబోయే ఈ పోరులో ఆరెంజ్ ఆర్మీ, రెడ్ ఆర్మీల మధ్య మైదానంలో ఎలాంటి ఫైట్ ఉంటుందో కానీ, మైదానం వెలుపల మాత్రం టికెట్ల కోసం పెద్ద యుద్ధమే జరుగుతోంది.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

