IND vs ZIM: సొంతగడ్డపై ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అలరించి, టి20 సిరీస్‌ను 'క్లీన్ స్వీప్' చేసిన భారత మహిళల క్రికెట్ జట్టు ఇప్పుడు వన్డే పోరుకు సిద్ధమైంది.
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్, జింబాబ్వే జట్ల మధ్య శుక్రవారం తొలి వన్డే మ్యాచ్ ప్రారంభం కానుంది.జింబాబ్వే మహిళల జట్టుతో టీమిండియా ఆడుతున్న తొలి ద్వైపాక్షిక వన్డే సిరీస్ ఇదే కావడం విశేషం. స్మృతి మంధాన సారథ్యంలోని భారత జట్టు టి20 సిరీస్ విజయోత్సాహంతో వన్డేల్లోనూ సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించాలని భావిస్తోంది.
ENG vs SL: ఇంగ్లండ్‌పై శ్రీలంక రికార్డు విజయం
ఫామ్ అందుకోవాల్సిందే
గతేడాది వన్డే వరల్డ్ కప్ సాధించిన తర్వాత టీమిండియా కేవలం మూడు వన్డే మ్యాచ్‌లే ఆడింది. అయితే, ఆ మూడింట్లోనూ పరాజయాన్ని చవిచూసింది. కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత జింబాబ్వేతో జరిగిన ఆఖరి టి20లో హర్మన్‌ప్రీత్ కౌర్ అద్భుత బ్యాటింగ్‌తో చెలరేగిపోయింది. వన్డే సిరీస్‌లోనూ ఆమె నుంచి టీమ్ మేనేజ్‌మెంట్ అదే తరహా ఆధిపత్య ప్రదర్శనను ఆశిస్తోంది.

పోరాడుతున్న జింబాబ్వే
మరోవైపు, ఈ పర్యటనలో ఇప్పటివరకు ఒక్క విజయం సాధించలేకపోయినా జింబాబ్వే జట్టు గట్టి పోరాటపటిమను ప్రదర్శిస్తోంది. ముఖ్యంగా ఫీల్డింగ్ విభాగంలో ఆ జట్టు మన జట్టు కంటే మెరుగైన ప్రదర్శన కనబరుస్తోంది. మరి ఈ వన్డే సిరీస్‌లో భారత్‌కు జింబాబ్వే ఎంతవరకు పోటీనిస్తుందో చూడాలి.

