Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నేడూ ఇందిరమ్మ టవర్స్ కు శంకుస్థాపన

నేడూ ఇందిరమ్మ టవర్స్ కు శంకుస్థాపన

వార్త 2 weeks ago

Indiramma Houses: హైదరాబాద్‌ నగరంలోని గాజులరామారంలో పేదల సొంతింటి కల సాకారం చేసే దిశగా మరో అడుగు పడింది. ఇందిరమ్మ ఇళ్ల టవర్ల నిర్మాణానికి సంబంధించి రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మంగళవారం ఉదయం 10 గంటలకు అధికారికంగా శంకుస్థాపన చేయనున్నారు.

ఈ కార్యక్రమం ద్వారా అర్హులైన నిరుపేద కుటుంబాలకు ఆధునిక హంగులతో కూడిన బహుళ అంతస్తుల భవనాలను అందించనున్నారు.

ఏడాదిలోపే నిర్మాణం పూర్తి – మంత్రి పొంగులేటి

ఈ ప్రాజెక్టుకు సంబంధించిన నిర్మాణ పనులను అత్యంత వేగంగా పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. శంకుస్థాపన చేసిన తేదీ నుంచి సరిగ్గా ఏడాదిలోపు నిర్మాణ పనులన్నీ పూర్తి చేసి, అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లను అప్పగిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు. నాణ్యతలో ఎటువంటి రాజీ పడకుండా పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

Indiramma Houses: ఇందిరమ్మ టవర్స్ రెండో విడత

ఇందిరమ్మ టవర్స్ పథకంలో భాగంగా చేపడుతున్న కార్యక్రమాల్లో ఇది రెండో విడతగా నిలిచింది. ఇప్పటికే ఈ ప్రతిష్టాత్మక పథకంలో మొదటి విడత కింద హైదరాబాద్‌లోని నాంపల్లి రెడ్‌హిల్స్‌లో ఇందిరమ్మ టవర్ల నిర్మాణానికి శంకుస్థాపన జరిగిన విషయం తెలిసిందే. నగరంలోని వివిధ ప్రాంతాల్లో అర్హులైన నిరుపేదలకు మెరుగైన వసతులు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ టవర్ల నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్తోంది.

సింగరేణి కార్మికులకు శుభవార్త.. రూ.1,10,250 బోనస్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha