Singareni Bonus: రాబోయే దసరా మరియు దీపావళి పండగల వేళ సింగరేణి కార్మికులకు కేంద్ర ప్రభుత్వం నుంచి తీపి కబురు అందింది. సింగరేణి కార్మికులకు పండుగ బోనస్‌గా ఒక్కొక్కరికి రూ.1,10,250 చొప్పున చెల్లించాలని నిర్ణయించినట్లు కేంద్రమంత్రి జి.
కిషన్‌రెడ్డి అధికారికంగా వెల్లడించారు. ఈ నిర్ణయంతో సింగరేణి కార్మిక కుటుంబాల్లో పండుగ వాతావరణం నెలకొంది.

తెలంగాణకు కొంగు బంగారం సింగరేణి: బొగ్గు ఉత్పత్తి పెంపుపై దృష్టి
ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. సింగరేణి సంస్థ తెలంగాణ రాష్ట్రానికి కొంగు బంగారం లాంటిదని ప్రశంసించారు. భవిష్యత్తులో బొగ్గు ఉత్పత్తిని మరింత పెంచే దిశగా పకడ్బందీ ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. కార్మికుల సంక్షేమం, వారి ఉద్యోగ భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తామని ఆయన స్పష్టం చేశారు.
Singareni Bonus: రూ.60 వేల కోట్ల బకాయిలు విడుదల చేయాలి
సింగరేణి సంస్థకు రావాల్సిన బకాయిలపై కూడా కిషన్‌రెడ్డి స్పందించారు. సంస్థకు చెల్లించాల్సిన సుమారు రూ.60 వేల కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సింగరేణి మరింత అభివృద్ధి చెందడానికి, కార్మికుల సంక్షేమం నిరంతరం కొనసాగడానికి కేంద్రం తరఫున తగిన సహకారం ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.
తెలంగాణ హైకోర్టుకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సాంకోషి

