Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నేడు కొడంగల్‌లో సీఎం రేవంత్  పర్యటన

నేడు కొడంగల్‌లో సీఎం రేవంత్ పర్యటన

వార్త 2 weeks ago

Revanth Reddy Kodangal Tour: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ శనివారం తన సొంత నియోజకవర్గమైన వికారాబాద్ జిల్లా కొడంగల్‌లో అధికారికంగా పర్యటించనున్నారు.

ఈ పర్యటన సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలలో ఆయన ప్రత్యక్షంగా పాల్గొననున్నారు.

ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా భాగస్వామ్యం

పర్యటనలో భాగంగా ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య కొడంగల్ జూనియర్ కళాశాల మైదానంలో ఘనంగా నిర్వహించనున్న ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించనున్నారు.

Revanth Reddy Kodangal Tour: 100 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ ప్రారంభం

ఉదయం 11 గంటలకు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన 100 పడకల అత్యాధునిక క్రిటికల్ కేర్ బ్లాక్‌ను సీఎం లాంఛనంగా ప్రారంభించనున్నారు. దీని ద్వారా స్థానిక ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ పర్యటనలో భాగంగా ఆసుపత్రితో పాటు ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్ మరియు స్థానిక బాలికల ఉన్నత పాఠశాలలో నూతనంగా నిర్మించిన తరగతి గదులను కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు.

అసెంబ్లీకి రాని కేసీఆర్ వెంటనే రాజీనామా చేయాలి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha