Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నేడు లాస్ట్.. MPTC, ZPTCలకు భారీగా నామినేషన్లు.. !

నేడు లాస్ట్.. MPTC, ZPTCలకు భారీగా నామినేషన్లు.. !

వార్త 1 day ago

AP Local Body Elections : ఆంధ్రప్రదేశ్‌లోని స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ అత్యంత ఉత్కంఠభరితంగా సాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 28 జిల్లాల్లో MPTC, ZPTC స్థానాలకు నామినేషన్ల పర్వం ఊపందుకుంది.

తొలిరెండు రోజుల్లోనే 9,829 MPTC స్థానాలకు ఏకంగా 26,828 నామినేషన్లు దాఖలయ్యాయి. ప్రధాన పార్టీలైన తెలుగుదేశం (TDP) 12,298, వైఎస్సార్‌ కాంగ్రెస్ (YCP) 10,501 నామినేషన్లు వేసి తమ పట్టు నిలుపుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తుండగా, జనసేన 1,779, బీజేపీ 488, కాంగ్రెస్ 273 నామినేషన్లు దాఖలు చేశాయి.

జిల్లాల వారీగా పరిశీలిస్తే కర్నూలు (1,715), తిరుపతి (1,555), బాపట్ల (1,432) జిల్లాల్లో అత్యధికంగా నామినేషన్లు నమోదవడం చూస్తుంటే స్థానిక రాజకీయం ఎంత వేడెక్కిందో స్పష్టమవుతోంది. ZPTC స్థానాల్లోనూ పెరిగిన పోటీ - ముగియనున్న తుది గడువు మరోవైపు, రాష్ట్రంలోని 659 ZPTC స్థానాల కోసం కూడా అభ్యర్థుల నుంచి భారీ స్పందన లభించింది. రెండు రోజుల్లోనే మొత్తం 2,396 నామినేషన్లు అధికారులు స్వీకరించారు. ఇందులో TDP 927 నామినేషన్లతో ముందంజలో ఉండగా, YCP 900 నామినేషన్లతో గట్టి పోటీనిస్తోంది. ఇక జనసేన 157, కాంగ్రెస్ 136, బీజేపీ 87 స్థానాల్లో నామినేషన్లు దాఖలు చేశాయి. కాగా, MPTC, ZPTC స్థానాలకు నామినేషన్లు సమర్పించడానికి నేడే చివరి రోజు కావడంతో, చివరి నిమిషంలో భారీగా దరఖాస్తులు వచ్చే అవకాశముంది. చివరి రోజు హడావుడితో నామినేషన్ కేంద్రాల వద్ద భారీ భద్రత ఏర్పాటు చేయగా, ఎన్నికల సంఘం అధికారులు ప్రక్రియను వేగవంతంగా పర్యవేక్షిస్తున్నారు.

ఏపీలో అలాయ్-బలాయ్ పెట్టాలంటూ వీహెచ్ సూచన

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha