Stock market: భారతీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు నష్టాలతో ముగిశాయి. రోజంతా ఒడిదొడుకులు ఎదుర్కొన్న మార్కెట్ చివరికి వచ్చేసరికి నష్టాల్లోకి జారుకుంది.
దీంతో ఇన్వెస్టర్లు తీవ్ర నిరాశకు గురయ్యారు. సెన్సెక్స్ 135.03 పాయింట్లు నష్టపోయి 75,183.36 వద్ద ముగియగా, నిఫ్టీ 4.30 పాయింట్ల స్వల్ప నష్టంతో 23,654.70 వద్ద స్థిరపడింది. ఐటీ, ఎఫ్‌ఎమ్‌సీజీ రంగాల షేర్లలో అమ్మకాల ఒత్తిడి పెరగడం వల్లే మార్కెట్లు కిందకు పడిపోయాయి.
Read also: Skoda Car: 'గ్రేటెస్ట్ ఆస్ ఎ ట్రాక్' పేరుతో స్కోడా ప్రచారం!
Stock Market Losses
రూపాయి విలువ భారీగా పెరిగింది
మరోవైపు కరెన్సీ మార్కెట్లో భారత రూపాయి ఊరటనిచ్చింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రంగంలోకి దిగడంతో డాలరుతో పోలిస్తే రూపాయి విలువ ఏకంగా 63 పైసలు బలపడింది. దీనివల్ల రూపాయి మారకం విలువ 96.23 కు చేరుకుంది. గత కొన్ని రోజులుగా పతనమవుతున్న రూపాయికి ఆర్‌బీఐ తీసుకున్న చర్యలు బాగా అండగా నిలిచాయి.
Stock market: లాభనష్టాల్లో ఉన్న ప్రధాన షేర్లు ఇవే
ఈరోజు మార్కెట్ ఒడిదొడుకుల్లో బజాజ్ ఫైనాన్స్, టెక్ మహీంద్రా, హిందుస్థాన్ యూనీలివర్, ఇన్ఫోసిస్, బజాజ్ ఫిన్‌సర్వ్ షేర్లు భారీగా నష్టపోయాయి. కానీ ఇండిగో, బీఈఎల్, ట్రెంట్, అదానీ పోర్ట్స్, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు మాత్రం మంచి లాభాలను ఆర్జించి మార్కెట్‌కు కొంతవరకు మద్దతుగా నిలిచాయి.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:
పసిడి ప్రియులకు వరుస షాకులు.. రెండు రోజుల్లో తులం బంగారం ఎంత పెరిగిందంటే?

