Musarambagh Amberpet Bridge: హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యల నివారణకు ప్రజా ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. అంబర్‌పేట్ మరియు మూసారాంబాగ్‌లను కలుపుతూ మూసీ నదిపై నూతనంగా నిర్మించిన బ్రిడ్జి (వారధి)ని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి (Revanth Reddy) సోమవారం ప్రారంభించనున్నారు.
ఈ నూతన వంతెన అందుబాటులోకి రావడం వల్ల అంబర్‌పేట్, మలక్‌పేట్ మరియు దిల్‌సుఖ్‌నగర్ ప్రాంతాల మధ్య నిత్యం ప్రయాణించే విద్యార్థులు, ఉద్యోగులు మరియు వాహనదారులకు తీవ్ర ట్రాఫిక్ ఇబ్బందుల నుండి విముక్తి లభించనుంది.
Musarambagh Amberpet Bridge: ప్రజలకు ట్రాఫిక్ రహిత వ్యవస్థే లక్ష్యం

గత ప్రభుత్వం తీవ్ర ట్రాఫిక్ రద్దీ ఉండే ఈ ప్రాంత అభివృద్ధిని విస్మరించిందని, కానీ తమ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వేగంగా పనులు పూర్తి చేసి వంతెనను అందుబాటులోకి తెచ్చిందని ప్రభుత్వం పేర్కొంది. ఈ కొత్త మూసీ వంతెనతో పాటు, సైదాబాద్ మరియు సంతోష్‌నగర్ ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ పనులను కూడా త్వరలోనే పూర్తి చేస్తామని ప్రభుత్వం తెలిపింది. భాగ్యనగర వాసులకు పూర్తిగా ట్రాఫిక్ రహిత ప్రయాణ వ్యవస్థను అందించడమే తమ ప్రాధాన్యత అని ప్రభుత్వం వెల్లడించింది.
అగ్గిపెట్టెరావు నీ దోపిడీని బయటకు తీస్తా అంటూ పొంగులేటి కీలక వ్యాఖ్యలు

