Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నేడు నాంపల్లి కోర్టుకు 'పుష్ప రాజ్ '

నేడు నాంపల్లి కోర్టుకు 'పుష్ప రాజ్ '

వార్త 2 months ago

Sandhya Theater Stampede Case : సినిమా ఇండస్ట్రీలో ఎంతటి క్రేజ్ ఉన్నప్పటికీ చట్టం ముందు అందరూ సమానులే అని నిరూపిస్తూ, స్టార్ హీరో అల్లు అర్జున్ నేడు హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టుకు హాజరుకానున్నారు.

భారీ అంచనాలతో విడుదలైన ‘పుష్ప 2’ సినిమా ప్రీమియర్ షో సమయంలో, హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర ఉన్న సంధ్య థియేటర్ వద్ద పెద్ద ఎత్తున తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. ఈ దురదృష్టకర ఘటనలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ కేసులో పోలీసులు దాఖలు చేసిన చార్జ్‌షీట్‌లో అల్లు అర్జున్‌ను 11వ నిందితుడిగా (A-11) చేర్చారు. ఈ నేపథ్యంలోనే నాంపల్లి కోర్టు మూడు రోజుల క్రితమే ఆయనకు సమన్లు జారీ చేస్తూ, ఖచ్చితంగా న్యాయస్థానం ముందు హాజరుకావాలని ఆదేశించింది.

వర్చువల్ విజ్ఞప్తిని తోసిపుచ్చిన కోర్టు.. నేటి నుంచే ట్రయల్ ప్రారంభం

ప్రస్తుతం ముంబైలో తన తదుపరి చిత్ర షూటింగ్ షెడ్యూల్స్‌లో బిజీగా ఉన్న అల్లు అర్జున్, ఈ విచారణకు స్వయంగా రాలేనని, వర్చువల్ (ఆన్‌లైన్ వీడియో కాన్ఫరెన్స్) పద్ధతిలో హాజరయ్యేందుకు అనుమతించాలని తన న్యాయవాదుల ద్వారా కోర్టును అభ్యర్థించారు. అయితే, ఈ విజ్ఞప్తిని నాంపల్లి కోర్టు పూర్తిగా తోసిపుచ్చింది. కేసు తీవ్రత దృష్ట్యా న్యాయస్థానానికి ఖచ్చితంగా వ్యక్తిగతంగానే హాజరుకావాల్సిందేనని జడ్జి స్పష్టం చేశారు. దీంతో షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చి అల్లు అర్జున్ నేడు కోర్టుకు రానున్నారు. ఆయన వ్యక్తిగత హాజరు నమోదు చేసుకున్న అనంతరం, ఈ తొక్కిసలాట కేసుపై కోర్టులో అధికారికంగా ట్రయల్ (విచారణ) ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ పరిణామంతో నాంపల్లి కోర్టు పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు క్రేజీ అప్డేట్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha