AP weather alert:బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేడు, రేపు భారీ వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ వాతావరణ మార్పు కారణంగా కొన్ని జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
Read also: Nuka Raju Family Suicide Case : సైనైడ్ నేనే ఇచ్చా'.. విచారణలో సాధిక్ వెల్లడి?
AP Weather Alert Heavy Rains Today And Tomorrow
తీవ్రమైన ఈదురుగాలులు హెచ్చరికలు
శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి జిల్లాలలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు పడే అవకాశం ఉంది. ఈ ప్రాంతాలలో ఆకాశం మేఘావృతం అయి ఉంటుంది.
AP weather alert:మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దు
తీర ప్రాంతాలలో గంటకు నర్బై నలభై నుండి అరవై కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని అధికారులు చెప్పారు. సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరిక జారీ చేశారు. రైతులు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
Epaper: epaper.vaartha.com

