Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సైనైడ్ నేనే ఇచ్చా'.. విచారణలో సాధిక్ వెల్లడి?

సైనైడ్ నేనే ఇచ్చా'.. విచారణలో సాధిక్ వెల్లడి?

వార్త 3 weeks ago

Nuka Raju Family Suicide Case : ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర కలకలం రేపిన అసిస్టెంట్ ఇంజనీర్ (AE) నూకరాజు కుటుంబం వరుస ఆత్మహత్యల కేసు దర్యాప్తులో పోలీసులు కీలక పురోగతి సాధించారు.

ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సాధిక్ పోలీసుల విచారణలో దిగ్భ్రాంతికర విషయాలను వెల్లడించినట్లు సమాచారం. నూకరాజు అల్లుడైన జగదీశ్వరరెడ్డిని మట్టుబెట్టేందుకు తానే పథకం ప్రకారం కొబ్బరి నీళ్లలో ప్రాణాంతకమైన సైనైడ్ కలిపి ఇచ్చానని నిందితుడు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. నూకరాజు కుటుంబంలో చోటుచేసుకున్న వరుస మరణాల వెనుక ఈ సైనైడ్ విషప్రయోగమే ప్రధాన కారణమని తేలడంతో ఈ దారుణ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తోంది.

ఆస్తి కాజేసేందుకు కుట్ర: బెదిరింపుల వల్లే తీవ్ర నిర్ణయం?

నూకరాజు కుమార్తె సౌజన్యను వివాహం చేసుకుంటే దాదాపు రూ. 25 కోట్ల విలువైన ఆస్తి తనకు దక్కుతుందని భావించినట్లు సాధిక్ విచారణలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. అయితే ఆ ప్రతిపాదనకు ఆ కుటుంబం ఒప్పుకోకపోవడంతో, వారిని అంతమొందించేందుకు బెదిరింపులకు పాల్పడినట్లు సమాచారం. ఈ క్రమంలోనే జగదీశ్వరరెడ్డికి విషమిచ్చి చంపగా, ఆ భయాందోళనలు మరియు సాధిక్ తీవ్ర బెదిరింపుల తట్టుకోలేకనే నూకరాజుతో సహా కుటుంబ సభ్యులు ఆత్మహత్యకు ఒడిగట్టారని అనుమానిస్తున్నారు. ‘వారు ఇలా ఆత్మహత్య చేసుకుంటారని నేను అసలు ఊహించలేదు’ అని సాధిక్ విచారణలో వెల్లడించినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై పోలీసులు పూర్తిస్థాయి ఆధారాలు సేకరించి కేసును మరింత వేగవంతం చేశారు.

పండుగ వేళ సొంతూళ్లకు వెళ్లడం కష్టమే

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha