Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నేడు తెలుగు రాష్ట్రాల్లో అతి భారీ వర్ష సూచన: IMD

నేడు తెలుగు రాష్ట్రాల్లో అతి భారీ వర్ష సూచన: IMD

వార్త 3 weeks ago

Weather Update:బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాబోయే రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం, ఈ అల్పపీడనం రానున్న రెండు రోజుల్లో మరింత బలపడే అవకాశం ఉంది.

దీని ప్రభావంతో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారనుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

Read also: India Rain Update: రాబోయే ఐదు రోజుల్లో 23 రాష్ట్రాలకు భారీ వర్షాలు: IMD

 Heavy rains in the Telugu states

తెలంగాణలో అతి భారీ వర్ష సూచన

తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. మిగిలిన జిల్లాల్లో కూడా అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడేటప్పుడు సురక్షిత ప్రాంతాల్లో ఉండటం మంచిది.

Weather Update:కోస్తాంధ్ర, రాయలసీమలో వర్షాల తీవ్రత

ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లో కూడా అల్పపీడన ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఉత్తర కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడా చిరుజల్లులు లేదా మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉంది. సముద్రతీర ప్రాంత ప్రజలు, మత్స్యకారులు వాతావరణ శాఖ సూచనలను పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరడమైనది.

Epaper: epaper.vaartha.com

రానున్న మూడు రోజుల్లో ఉత్తరాంధ్రలో పలుచోట్ల భారీ వర్షాలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha