Ponguleti Srinivas Reddy: తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ మరియు గృహనిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సోమవారం నాడు వనపర్తి జిల్లాలో అధికారికంగా పర్యటించనున్నారు.
ఈ పర్యటనలో భాగంగా ఆయన జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. ముఖ్యంగా విద్యా రంగానికి పెద్దపీట వేసేలా కీలక భవన నిర్మాణాలకు పునాదిరాయి వేయనున్నారు.

తెలంగాణ పబ్లిక్ స్కూల్, బీసీ కళాశాలలకు శంకుస్థాపనలు
ఈ పర్యటనలో మంత్రి పొంగులేటి చేతుల మీదుగా ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల శంకుస్థాపన కార్యక్రమాలు జరగనున్నాయి. వనపర్తిలో ఏర్పాటు చేయనున్న నూతన తెలంగాణ పబ్లిక్ స్కూల్ అలాగే బీసీ వెల్ఫేర్ జూనియర్ కాలేజీ భవన నిర్మాణాలకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. విద్యార్థులకు మెరుగైన వసతులు, నాణ్యమైన విద్యను అందించే దిశగా ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంటోంది.
Ponguleti Srinivas Reddy: ఇందిరమ్మ ఇళ్లపై అధికారులతో సమీక్షా సమావేశం
శంకుస్థాపనల అనంతరం మంత్రి పొంగులేటి ఉమ్మడి జిల్లా అధికారులతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ముఖ్యంగా ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు తీరుపై అధికారులతో సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించనున్నారు. ఇళ్ల నిర్మాణాల ప్రగతి, అర్హుల ఎంపిక ప్రక్రియ తదితర అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు.
'ప్యారడైజ్'లో శంకరన్న పాత్రపై కేటీఆర్ ప్రశంసలు.. ప్రియదర్శి ఆసక్తికర వ్యాఖ్యలు

