దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన నీట్ (NEET UG) క్వశ్చన్ పేపర్ లీక్ కేసు దర్యాప్తులో రోజుకో షాకింగ్ నిజం వెలుగులోకి వస్తోంది. ఈ భారీ కుంభకోణంలో విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ప్రొఫెసర్లే ప్రధాన సూత్రధారులుగా మారుతుండటం విస్మయానికి గురిచేస్తోంది.
ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇందులో భాగంగానే నిన్న కెమిస్ట్రీ ప్రొఫెసర్ కులకర్ణిని అదుపులోకి తీసుకోగా, ఈరోజు బోటనీ టీచర్ మనీషాను సిబిఐ అధికారులు అరెస్ట్ చేశారు. ప్రశ్నపత్రాల రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన వీరే.. స్వయంగా లీకేజీకి పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.
Read Also : తన 4 బలమైన కోరికలను బయటకు తెలిపిన మోడీ
NEET EXAM సబ్జెక్టుల వారీగా వర్క్ డివైడ్.. పక్కా ప్లాన్‌తో లీకేజ్
ఈ ప్రొఫెసర్లు ఇద్దరూ అత్యంత పకడ్బందీగా, ఒక క్రమపద్ధతిలో ఈ పేపర్ లీక్‌కు పాల్పడినట్లు సిబిఐ గుర్తించింది. తాము తయారు చేసే ప్రశ్నలను బయటకు చేరవేయడానికి వీరు సబ్జెక్టుల వారీగా పనిని విభజించుకున్నారు (Work Division). కెమిస్ట్రీ విభాగానికి సంబంధించిన ప్రశ్నలను కులకర్ణి, బోటనీ విభాగానికి సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలను మనీషా లీక్ చేస్తూ వచ్చారు. నిందితులు ఇద్దరూ ఒకరికొకరు సమన్వయం చేసుకుంటూ, అత్యంత రహస్యంగా పరీక్షకు ముందే ప్రశ్నపత్రాలను డీల్ చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న పరీక్షను వీరు తమ స్వార్థం కోసం వ్యాపారంగా మార్చేశారనే ఆరోపణలు బలపడుతున్నాయి.
టెలిగ్రామ్ చాటింగ్.. సాక్ష్యాల తారుమారుకు యత్నం
ఈ నెట్‌వర్క్ అంతా డిజిటల్ మాధ్యమాల ద్వారానే సాగినట్లు సిబిఐ కనుగొంది. నిందితులు ఇద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి, ప్రశ్నలను షేర్ చేయడానికి ‘టెలిగ్రామ్’ (Telegram) యాప్‌ను వేదికగా చేసుకున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు టెలిగ్రామ్ గ్రూపులు, సీక్రెట్ చాట్ల ద్వారా సమాచారాన్ని చేరవేశారు. అయితే, దేశవ్యాప్తంగా నీట్ పేపర్ లీక్ వ్యవహారం రచ్చకెక్కి, మీడియాలో వార్తలు రావడం ప్రారంభం కాగానే అప్రమత్తమైన నిందితులు.. సాక్ష్యాలను మాయం చేసేందుకు ప్రయత్నించారు. టెలిగ్రామ్‌లోని చాట్ హిస్టరీ మొత్తాన్ని డిలీట్ చేశారు. అయినప్పటికీ, నిందితుల మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్న సిబిఐ అధికారులు, డిజిటల్ ఫొరెన్సిక్ ల్యాబ్ సహాయంతో ఆ డేటాను రికవరీ చేసే పనిలో పడ్డారు. దీని వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారనే కోణంలో విచారణ కొనసాగుతోంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

