Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నెగటివ్ ప్రచారంపై సీరియస్.. పోలీసులను ఆశ్రయించిన విజయ్-రష్మిక టీమ్

నెగటివ్ ప్రచారంపై సీరియస్.. పోలీసులను ఆశ్రయించిన విజయ్-రష్మిక టీమ్

వార్త 0 months ago

Vijay-Rashmika: టాలీవుడ్ ప్రముఖ నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న (విరోష్)పై సోషల్ మీడియా వేదికగా సాగుతున్న తప్పుడు ప్రచారంపై వారి మేనేజ్‌మెంట్ టీమ్ తీవ్రంగా స్పందించింది.

వీరిద్దరిపై కొన్ని వర్గాలు ఉద్దేశపూర్వకంగా నెగటివ్ ట్రెండ్స్ సృష్టిస్తున్నాయంటూ ఆరోపిస్తూ సోమవారం నాడు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు అందజేశారు. తమ హీరో, హీరోయిన్ల వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసే వారిపై చట్టపరంగా ఎంతవరకైనా వెళతామని వారు స్పష్టం చేశారు.

'కొఫీ విత్ కరణ్' వ్యాఖ్యల వక్రీకరణే కారణం

విషయంలోకి వెళితే, ప్రముఖ టాక్ షో ‘కాఫీ విత్ కరణ్’ కార్యక్రమంలో గతంలో విజయ్, రష్మిక మాట్లాడిన కొన్ని మాటలను కొందరు కావాలనే వక్రీకరించారు. ఆ వ్యాఖ్యలకు తప్పుడు అర్థాలు ఆపాదిస్తూ సోషల్ మీడియాలో దుర్మార్గమైన పోస్టులు పెడుతున్నారని వారి ప్రతినిధులు సైబర్ క్రైమ్ డీసీపీని కలిసి వివరించారు. ఈ తరహా ఉద్దేశపూర్వక చర్యలు వారికి తీవ్ర మానసిక ఆందోళనను, వేదనను కలిగిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

Vijay-Rashmika: వ్యక్తిగత వేధింపులను సహించబోం: పక్కా ఆధారాలతో ఫిర్యాదు

నిర్మాణాత్మక విమర్శలను, భావ ప్రకటనా స్వేచ్ఛను తాము ఎప్పుడూ గౌరవిస్తామని, కానీ వ్యక్తిగత జీవితాలపై బురదజల్లేలా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయడాన్ని మాత్రం ఉపేక్షించేది లేదని టీమ్ స్పష్టం చేసింది. ఈ ఫేక్ ప్రచారానికి పాల్పడుతున్న సోషల్ మీడియా ఖాతాల వివరాలు, స్క్రీన్‌షాట్లు మరియు ఇతర కీలక ఆధారాలను పోలీసులకు సమర్పించారు. ఫిర్యాదును స్వీకరించిన సైబర్ క్రైమ్ అధికారులు ఈ అంశంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ట్రోలర్స్‌కు విజయ్ దేవరకొండ ఘాటు రిప్లై

ఇటీవల కాలంలో సోషల్ మీడియా ట్రోలింగ్‌కు చెక్ పెట్టేందుకు విజయ్ దేవరకొండ స్వయంగా రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. రష్మికతో ఉన్న ఒక ప్రత్యేక వీడియోను షేర్ చేస్తూ ట్రోలర్స్‌కు ఆయన గట్టి సమాధానం ఇచ్చారు. ఆ పోస్టులో ఆమెను తన “ఆత్మసఖి, భార్య, స్నేహితురాలు” అంటూ అభివర్ణించారు. వాస్తవాలు తెలుసుకోకుండా ఫెమినిజం ముసుగులో తమ వ్యక్తిగత, కుటుంబ విషయాలపై అసత్య ఆరోపణలు చేస్తూ వేధించడం సరికాదని విజయ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

అభిమానులకు క్షమాపణలు చెప్పిన హీరో విశ్వక్ సేన్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha