BRS MLAs Protest: తెలంగాణ శాసనసభ సమావేశాలను తూతూమంత్రంగా ముగించకుండా, కనీసం నెల రోజుల పాటు నిర్వహించాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ డిమాండ్ చేశారు.
ప్రజా సమస్యలు, రాష్ట్ర అభివృద్ధిపై సమగ్రమైన చర్చ జరిగేలా శాసనసభా స్పీకర్ ప్రత్యేక చొరవ తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సభను కొన్ని రోజులకే పరిమితం చేసి ముగించడం సరికాదని, ప్రతి అంశంపైనా లోతైన విశ్లేషణకు సమయం కేటాయించాలని పేర్కొన్నారు.
Read Also: BRS MLAs Protest: నల్ల టీషర్టులతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన.. అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత
Assembly sessions should be held for a month: KTR
BRS MLAs Protest: ఉద్యోగుల సమస్యలపై గొంతు విప్పుతాం
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై బీఆర్ఎస్ అసెంబ్లీలో ప్రధానంగా పోరాడుతుందని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉద్యోగులకు సంబంధించి 7 డీఏ (DA)లు పెండింగ్‌లో ఉన్నాయని, పదవీ విరమణ పొందిన వారికి కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా ఉద్యోగులు, రిటైర్డ్ సిబ్బంది తరఫున సభలో గొంతు విప్పుతామని హామీ ఇచ్చారు.
22ఏ కుంభకోణంపై ప్రభుత్వాన్ని నిలదీస్తాం
రాష్ట్రంలో 22ఏ (Prohibited Lands) పేరుతో జరుగుతున్న భారీ కుంభకోణంపై అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని నిలదీస్తామని కేటీఆర్ హెచ్చరించారు. భూముల కేటాయింపు, నిషేధిత జాబితా నిర్వహణలో తీవ్ర అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలను, అక్రమాలను సభా సమక్షంలో ఎండగట్టి, ప్రజల ముందుకు నిజాలను తీసుకువస్తామని తేల్చి చెప్పారు.
Epaper: epaper.vaartha.com
ట్రాన్స్‌జెండర్లు బెదిరింపులకు దిగితే కఠిన చర్యలు.. సీవీ ఆనంద్

