Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ట్రాన్స్‌జెండర్లు బెదిరింపులకు దిగితే కఠిన చర్యలు.. సీవీ ఆనంద్

ట్రాన్స్‌జెండర్లు బెదిరింపులకు దిగితే కఠిన చర్యలు.. సీవీ ఆనంద్

వార్త 3 weeks ago

DGP CV Anand: గృహప్రవేశాలు, వివాహాలు, కొత్త వ్యాపారాల ప్రారంభోత్సవాల వంటి శుభకార్యాల సమయంలో కొందరు ట్రాన్స్‌జెండర్లు అధిక మొత్తంలో డబ్బులు డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలు ఇటీవల ఎక్కువగా వినిపిస్తున్నాయి.

హైదరాబాద్‌లోని చింతల్‌లో జరిగిన ఓ గృహప్రవేశ కార్యక్రమంలో ఇంట్లోకి అడుగుపెట్టాలంటే రూ.50 వేలు ఇవ్వాలంటూ కొందరు ట్రాన్స్‌జెండర్లు పట్టుబట్టిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. డబ్బులు ఇవ్వడం సాధ్యం కాదని బాధితులు చెప్పడంతో వారు అసభ్యంగా ప్రవర్తించారని కుటుంబ సభ్యులు ఆరోపించారు.

ఇదే అంశంపై బిగ్‌బాస్ ఫేమ్, యాంకర్ అరియానా గ్లోరీ కూడా స్పందించారు. తన గృహప్రవేశం సమయంలో కొందరు ట్రాన్స్‌జెండర్లు రూ.25 వేల నుంచి రూ.లక్ష వరకు డబ్బులు డిమాండ్ చేస్తూ ఇబ్బందులకు గురిచేశారని ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అయితే తన వ్యాఖ్యలు మొత్తం ట్రాన్స్‌జెండర్ సమాజాన్ని ఉద్దేశించినవి కాదని అరియానా స్పష్టం చేశారు. బలవంతంగా డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నించే వ్యక్తుల తీరుపైనే తాను అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Read Also: KTR Harish Rao Arrested: అసెంబ్లీ వద్ద తీవ్ర ఉద్రిక్తత: కేటీఆర్, హరీశ్‌రావుల అరెస్ట్!

 Strict action if transgender individuals resort to intimidation: CV Anand

DGP CV Anand: డీజీపీ సీవీ ఆనంద్ కీలక హెచ్చరిక

ట్రాన్స్‌జెండర్ల పేరుతో జరుగుతున్న బలవంతపు వసూళ్లపై తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ తీవ్రంగా స్పందించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఘటనలు, ప్రజల నుంచి అందుతున్న ఫిర్యాదులను దృష్టిలో పెట్టుకుని ‘ఎక్స్’ వేదికగా ఆయన స్పందించారు. ప్రజలను భయపెట్టడం, బెదిరించడం, బలవంతంగా డబ్బులు వసూలు చేయడం వంటి చర్యలకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ఇలాంటి అక్రమ వసూళ్లకు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్రంలోని అన్ని పోలీస్ కమిషనరేట్లు, ఎస్పీ పరిధుల్లో త్వరలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని అధికారులను ఆదేశించనున్నట్లు తెలిపారు.

గతంలోనూ ప్రత్యేక చర్యలు

హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా పనిచేసిన సమయంలోనూ ఇలాంటి బలవంతపు వసూళ్లు, భిక్షాటన ముఠాలపై ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చిన విషయాన్ని డీజీపీ గుర్తుచేశారు. ప్రస్తుతం మళ్లీ ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తుండటంతో గతంలో మాదిరిగానే కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

గౌరవప్రదమైన జీవనానికి ప్రభుత్వ సహకారం

ట్రాన్స్‌జెండర్లు సమాజంలో గౌరవప్రదంగా జీవించేందుకు తెలంగాణ ప్రభుత్వం పలు సంక్షేమ, ఉపాధి కార్యక్రమాలను అమలు చేస్తోందని సీవీ ఆనంద్ తెలిపారు. ట్రాఫిక్ అసిస్టెంట్లతో పాటు హైడ్రా వంటి విభాగాల్లో వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించగా, వారు బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తున్నారని ప్రశంసించారు. గౌరవప్రదమైన జీవనం సాగించాలని కోరుకునే వారికి పోలీసు శాఖ నుంచి ఎల్లప్పుడూ సహకారం ఉంటుందని చెప్పారు. అయితే శుభకార్యాల వద్దకు వెళ్లి బెదిరింపులకు పాల్పడటం, బలవంతంగా డబ్బులు వసూలు చేయడం వంటి చర్యలకు పాల్పడితే మాత్రం చట్టపరంగా కఠిన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని డీజీపీ స్పష్టం చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha