Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నెల తిరక్కుండానే ఓటీటీలోకి 'బ్యాండ్ మేళం'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

నెల తిరక్కుండానే ఓటీటీలోకి 'బ్యాండ్ మేళం'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

వార్త 2 months ago

Band Melam OTT: 'కోర్ట్' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న హర్ష్ రోషన్, శ్రీదేవి జంటగా నటించిన చిత్రం 'బ్యాండ్ మేళం' (Band Melam).

గ్రామీణ నేపథ్యంతో కూడిన లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ ప్రియులను అలరించేందుకు సిద్ధమైంది.మార్చి 26న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ, కథలోని నేటివిటీ వల్ల ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Read Also: Jailer 2 Leaked Scenes: మొన్న జననాయగన్ .. నేడు జైలర్ 2.. తప్పని లీకుల బెడద

Band Melam OTT: ఎప్పుడు.. ఎందులో?

ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ ZEE5 సొంతం చేసుకుంది. ఏప్రిల్ 24 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు సదరు సంస్థ అధికారికంగా ప్రకటించింది. "మీరు మెచ్చిన జంట మరోసారి దరువెయ్యబోతున్నారు.. ఆర్ యూ రెడీ ఫర్ ది రిథమ్" అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టర్‌ను విడుదల చేసింది.

ఈ సినిమా కథ విషయానికి వస్తే..

యాదగిరి అలియాస్ గిరి (రోషన్), రాజీ (శ్రీదేవి) వరుసకు బావ మరదలు కావడంతో వీరిద్దరికీ పెళ్లి చేయాలని వాళ్ల చిన్నప్పుడే పెద్దలు నిశ్చయిస్తారు. కానీ వీళ్ళిద్దరూ పెరిగి పెద్దయిన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోతాయి. గిరి మ్యూజిక్ అంటే ఎంతో ప్రాణం పెడతారు రాజీ మాత్రం చదువులలో టాపర్ గా ఉంటుంది. మ్యూజిక్ అంటే ఎంతో ఇష్టమైనటువంటి గిరి తన స్నేహితులతో కలిసి ఊర్లో మ్యూజిక్ బ్యాండ్ పెడతారు. ఇక రాజీ మాత్రం ఉన్నది చదువుల కోసం పట్నం వెళ్తుంది. ఇక వీరిద్దరికి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నప్పుడు రాజీ తండ్రి సాయన్న (సాయికుమార్) అందుకు ఒకప్పుడు. చిన్నప్పటినుంచి రాజీ తనకు కాబోయే పెళ్ళామని కలలు కన్నా గిరి తన మరదలి కోసం ఏం చేశాడు? నిజంగానే రాజి వేరే వారిని పెళ్లి చేసుకుందా? లేక వీరిద్దరికి పెళ్లి జరిగిందా? అనేది తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

అల్లు అర్జున్ ఫొటో, వాయిస్ వాడితే చర్యలు తప్పవు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha