Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మొన్న జననాయగన్ .. నేడు జైలర్ 2.. తప్పని లీకుల బెడద

మొన్న జననాయగన్ .. నేడు జైలర్ 2.. తప్పని లీకుల బెడద

వార్త 2 months ago

Jailer 2 Leaked Scenes: సినిమా రంగంలో పైరసీ, లీకేజీ సమస్యలు అగ్ర హీరోల చిత్రాలను వెంటాడుతూనే ఉన్నాయి. సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులకు, కోలీవుడ్ వర్గాలకు ఈ వార్త పెద్ద షాక్‌కు గురిచేసింది.

విజయ్ నటించిన 'జననాయగన్' లీకేజీ ఉదంతం మరువక ముందే, ఇప్పుడు 'జైలర్ 2' (Jailer 2) సీన్లు నెట్టింట ప్రత్యక్షమవ్వడం కలకలం రేపుతోంది.

Read Also:INCA Awards 2026: ముంబైలో మెరిసిన టాలీవుడ్ స్టార్.. చైతూకు 'ఉత్తమ నటుడు' పురస్కారం

ఈ చిత్రానికి సంబంధించి రెండు కీలక సన్నివేశాలు ఇంటర్నెట్‌లో లీక్ అయ్యాయి. ఈ ఘటనతో చిత్ర నిర్మాణ సంస్థ, అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 Rajinikanth Jailer 2 Movie Updates

Jailer 2 Leaked Scenes: నిర్మాతల ఆగ్రహం

కళానిధి మారన్ నేతృత్వంలోని సన్ పిక్చర్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. సీన్లు లీక్ అవ్వడంపై నిర్మాణ సంస్థ సీరియస్ అయ్యింది. దీనిపై ఒక అధికారిక ప్రకటన విడుదల చేస్తూ.. “లీకైన క్లిప్స్‌ను ఎవరూ షేర్ చేయవద్దని, వాటిని ప్రచారం చేయడం చట్టరీత్యా నేరమని” హెచ్చరించారు. ఇప్పటికే పైరసీ నిరోధక బృందం (Anti-Piracy Team) సోషల్ మీడియా వేదికలను నిరంతరం పర్యవేక్షిస్తోందని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న భారీ బడ్జెట్ మల్టీస్టారర్ చిత్రం జైలర్ 2. నెల్సన్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. ఈ సినిమాలో మలయాల స్టార్ మోహన్ లాల్ సైతం నటిస్తున్నారు. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్‌ పాత్ర అలరించనుంది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

చిరాగ్ నాకు మంచి ఫ్రెండ్: కంగనా రనౌత్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha