PM Internship Scheme: దేశంలోని యువతకు నైపుణ్య శిక్షణ మరియు పని అనుభవాన్ని (Work Experience) అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ పథకం (PM Internship Scheme) మూడో విడత ప్రక్రియ కొనసాగుతోంది.
ఈ పథకం ద్వారా కార్పొరేట్ రంగంలో శిక్షణ పొందేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.
Read Also :UGC NET June 2026: యూజీసీ నెట్ 2026 ఫలితాలు విడుదల.. కట్-ఆఫ్స్ ఇవే!

ఆఫర్ చేసే ఆర్థిక ప్రయోజనాలు
- నెలవారీ స్టైపెండ్: ఎంపికైన ఇంటర్న్‌లకు నెలకు రూ. 9,000 వంతున ఆర్థిక సాయం అందించబడుతుంది.
- ప్రత్యేక ఆర్థిక గ్రాంట్: ఇంటర్న్‌షిప్ ప్రారంభంలో ఒకేసారి రూ. 6,000 ప్రత్యేక గ్రాంట్ కూడా అందజేస్తారు.
- వ్యవధి: ఈ ఇంటర్న్‌షిప్ వ్యవధి 6 నుండి 9 నెలల పాటు ఉంటుంది.
PM Internship Scheme: అర్హత ప్రమాణాలు
- వయోపరిమితి: 18 నుండి 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న యువత అర్హులు.
- విద్యార్హతలు: పదో తరగతి (10th), ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమా, గ్రాడ్యుయేషన్ (డిగ్రీ) నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ (PG) పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆసక్తి కలిగిన అర్హులైన అభ్యర్థులు అధికారిక పోర్టల్ ద్వారా తమ వివరాలను నమోదు చేసుకుని ఇంటర్న్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.

