Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Nellore Crime: ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య

Nellore Crime: ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య

వార్త 2 months ago

Nellore Crime: ఆర్ధిక ఇబ్బందులు తాళలేక ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వేదాయపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..

స్థానిక విఎంఆర్ నగర్ కు చెందిన రాజా (50) పెయింటర్ గా పని చేస్తున్నాడు. గత కొంతకాలంగా జీవనోపాధి సరిగా దొరకక అప్పులు చేయాల్సి వచ్చింది. ఈ ఆర్ధిక సమస్యలు రోజురోజుకీ ఎక్కువ కావడంతో తాళలేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో రేకుల కింద ఉండే ఇనుప రాడ్డుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు వేదాయపాలెం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha