Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నెల్లూరు హైవేపై ఘోర ప్రమాదం.. పలువురికి తీవ్ర గాయాలు!

నెల్లూరు హైవేపై ఘోర ప్రమాదం.. పలువురికి తీవ్ర గాయాలు!

వార్త 2 weeks ago

​Nellore Bus accident:నెల్లూరు నగర పరిధిలో గురువారం ఒక ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చింతారెడ్డిపాళెం క్రాస్ రోడ్డు సమీపంలోని కలకత్తా-చెన్నై జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న ఒక టూరిస్ట్ బస్సు ప్రమాదవశాత్తూ అదుపు తప్పి బోల్తా పడింది.

ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఏలూరు నుంచి నాగపట్నం వెళ్తుండగా ప్రమాదం సేకరించిన సమాచారం మేరకు .. ఈ బస్సు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నుండి తమిళనాడులోని నాగపట్నం వైపు వెళ్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 45 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో 39 మంది వరకు ఈ రాధా ప్రమాదంలో గాయపడినట్లు సమాచారం.

బస్సులో 45 మంది ప్రయాణికులు

ఒక్కసారిగా బస్సు బోల్తా పడటంతో లోపల ఉన్న ప్రయాణికులు భయాందోళనలతో కేకలు వేశారు. ​ప్రమాదం జరిగిన వెంటనేస్థానిక ప్రజలు స్పందించి, క్షతగాత్రులను బస్సులోంచి బయటకు తీసేందుకు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను వేగవంతం చేశారు. ​గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదానికి గల పూర్తి కారణాలు, డ్రైవర్ నిద్రమత్తే కారణమా లేదా సాంకేతిక లోపమా అనే విషయాలపై నార్త్ ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Read also: YS Sharmila: రాహుల్ గాంధీతో వైఎస్ షర్మిల భేటీ

​Nellore Bus accident:రూరల్ ఎమ్మెల్యే పరామర్శ

బస్సు ప్రమాద విషయం తెలుసుకున్న రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గాయపడి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. గాయపడిన వారు పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గానికి చెందినవారు కావడంతో అక్కడ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తో ఫోన్లో మాట్లాడి వీరి పరిస్థితి వివరించారు. వారికి దగ్గరుండి వైద్యసాహం అందజేసి క్షేమంగా పంపిస్తానని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

ఏపీలో రాబోయే మూడు రోజుల పాటు వర్ష సూచన

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha