Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రాహుల్ గాంధీతో వైఎస్ షర్మిల భేటీ

రాహుల్ గాంధీతో వైఎస్ షర్మిల భేటీ

వార్త 2 months ago

YS Sharmila: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (APCC) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల దిల్లీలో కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

కర్ణాటకలో త్వరలోనే రాజ్యసభ ఎన్నికలు జరగనున్న తరుణంలో ఈ భేటీ జరగడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సమక్షంలో జరిగిన ఈ సమావేశంలో కర్ణాటక కోటా నుంచి షర్మిల రాజ్యసభ సీటును ఆశిస్తున్నట్లు జాతీయ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది.

Read also: Fake ACB Officer: ఎస్సై కల చెదిరి.. నకిలీ ఏసీబీ అధికారిగా మారి: 250 మంది అధికారులను ముంచిన యువకుడు

విలీనం నాటి హామీ.. పెద్దల సభలో ఏపీ గొంతుక!

గతంలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ (YSRTP)ని కాంగ్రెస్‌లో విలీనం చేసిన సందర్భంలోనే వైఎస్ షర్మిలకు పార్లమెంట్ ఎగువ సభ (రాజ్యసభ) స్థానాన్ని కేటాయిస్తామని కాంగ్రెస్ అధిష్ఠానం హామీ ఇచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం కర్ణాటకలో ఖాళీ అవుతున్న స్థానాల నేపథ్యంలో ఆ హామీని నెరవేర్చాల్సిందిగా ఆమె కోరుతున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడంతో పాటు, పార్లమెంట్‌లో ఏపీ తరఫున గట్టిగా గొంతు వినిపించడానికి ఈ పదవి తనకు ఎంతో అవసరమని ఆమె అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

YS Sharmila: కేవలం సాధారణ సమీక్షే అన్న షర్మిల

రాహుల్ గాంధీతో భేటీ ముగిసిన అనంతరం వైఎస్ షర్మిల మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఈ భేటీపై వస్తున్న ఊహాగానాలను పెద్దగా ప్రస్తావించకుండా ఇది ఎప్పటిలాగే సాగిన ఒక సాధారణ సమీక్షా సమావేశం మాత్రమేనని తేలిక పరిచారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌లోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పార్టీ సంస్థాగత బలోపేతంపైనే చర్చలు జరిగాయని ఆమె స్పష్టం చేశారు. కాగా, రాహుల్ గాంధీతో జరిగిన ఈ భేటీలో షర్మిలతో పాటు ఆమె భర్త బ్రదర్ అనిల్ కుమార్ కూడా పాల్గొనడం గమనార్హం.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read also:

భోగాపురం విమానాశ్రయం ప్రధానమంత్రిచే ప్రారంభిస్తాం: మంత్రి శ్రీనివాస్ వెల్లడి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha