Prashanthi Reddy: నెల్లూరు జిల్లాలో వర్షాకాలం మొదలై రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమవుతున్న వేళ.. ఎరువుల కొరతపై జరుగుతున్న ప్రచారంపై స్థానిక టీడీపీ ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
జిల్లాలో యూరియా దొరకడం లేదంటూ కొందరు రాజకీయ స్వార్థం కోసం కావాలనే తప్పుడు వార్తలను వ్యాప్తి చేస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read also: RGUKT IIIT Results: ట్రిపుల్ ఐటీ ఫలితాలు విడుదల.. ప్రొవిజనల్ లిస్ట్‌ను ప్రకటించిన మంత్రి లోకేశ్
కాకాణి, ప్రసన్న కుమార్‌లపై ఘాటు విమర్శలు
ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యేలు కాకాణి గోవర్ధన్ రెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిల తీరుపై ప్రశాంతి రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. కేవలం రాజకీయ ఉనికి కోసమే వారు రైతాంగాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని, యూరియా లభ్యతపై లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇటీవల కోవూరులో జరిగిన ఓ కార్యక్రమానికి వారు హాజరైన తీరును ప్రస్తావిస్తూ.. అక్కడికి వాళ్లు ఏదో పేరంటానికి వెళ్లినట్లు వెళ్లారని ఎద్దేవా చేశారు. క్షేత్రస్థాయిలో రైతుల సమస్యలను పరిష్కరించడం చేతకాని వారు, ఇప్పుడు కేవలం రాజకీయ విమర్శలకే పరిమితమయ్యారని దుయ్యబట్టారు.
Prashanthi Reddy: జిల్లాలో పుష్కలంగా ఎరువుల నిల్వలు.. ఆందోళన వద్దు!
నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఎక్కడా యూరియా కొరత లేదని, అన్నదాతల అవసరాలకు సరిపడా ఎరువుల నిల్వలు సిద్ధంగా ఉన్నాయని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. సాగు సీజన్‌కు అనుగుణంగా రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులను కూటమి ప్రభుత్వం సమృద్ధిగా అందుబాటులో ఉంచిందని తెలిపారు. కొంతమంది సృష్టిస్తున్న వదంతులను నమ్మి రైతులు గందరగోళానికి గురికావద్దని, వ్యవసాయ అధికారుల సూచనలను పాటించాలని ఆమె కోరారు. యూరియా కొరత ఉందనే ప్రచారంలో ఎలాంటి నిజం లేదని, రైతులు ధైర్యంగా సాగు పనులు చేసుకోవచ్చని ప్రశాంతి రెడ్డి భరోసా ఇచ్చారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read also:

