- సమస్యల పరిష్కారంలో సరికొత్త రికార్డు
- నెల్లూరు జిల్లా గ్రీవెన్స్ డేటా వివరాలపై ఆరా తీసిన మంత్రి
- రెవెన్యూ సమస్యలపైనే ఫోకస్.
Nellore News:నెల్లూరు జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం క్రమం తప్పకుండా సాగుతోంది.సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ హిమాన్షు శుక్లాతో కలిసి రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ పాల్గొని స్వయంగా ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు.
ఈ సందర్భంగా మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నెల్లూరు జిల్లావ్యాప్తంగా మొత్తం 82,166 గ్రీవెన్స్ దరఖాస్తులు రాగా, అధికారులు రికార్డు స్థాయిలో 87 శాతం అంటే 71,549 అర్జీలను విజయవంతంగా పరిష్కరించారని వెల్లడించారు.
Read also: Palanadu road accident: పల్నాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి!
Nellore News:రెవెన్యూ సమస్యలపై ప్రత్యేక దృష్టి
పరిష్కారమైన వాటిలో కేవలం 5,384 మంది మాత్రమే సంతృప్తి చెందక మళ్లీ దరఖాస్తు చేసుకున్నారని, మొత్తం అర్జీలలో సింహభాగం 57 శాతం ఒక్క రెవెన్యూ శాఖ నుంచే వస్తున్నాయని ఆయన తెలిపారు. రెవెన్యూ విభాగంలోనూ 84 శాతం సమస్యలను ఇప్పటికే పరిష్కరించారని చెప్పారు.ఎక్కువగా కుటుంబాల ఆస్తి తగాదాలు, పొలాల సరిహద్దు వివాదాలే వస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ప్రతి సోమవారం జరిగే గ్రీవెన్స్ సెల్ పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు
నాయుడు స్వయంగా పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.
Epaper: epaper.vaartha.com

