Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నెల్లూరు విషాదం..సముద్రంలో గల్లంతైన ముగ్గురు చిన్నారులు

నెల్లూరు విషాదం..సముద్రంలో గల్లంతైన ముగ్గురు చిన్నారులు

వార్త 6 days ago

Nellore: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కోడూరు తీరానికి విహారయాత్రకు వెళ్లిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చిన్నారులు సముద్ర స్నానం చేస్తూ అలల ఉధృతికి కొట్టుకుపోయారు.

ఈ ప్రమాదంలో నాలుగేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోగా, ఒక బాలికను స్థానికులు ప్రాణాలతో రక్షించారు. సముద్రంలో కొట్టుకుపోయిన మరో బాలిక కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.

 Rottela Panduga Accident

Nellore: రొట్టెల పండుగకు వచ్చి.. బీచ్‌లో అనంతలోకాలకు!

పోలీసుల కథనం ప్రకారం.. చిత్తూరు జిల్లా సోమల మండలం కందూరు ప్రాంతానికి చెందిన ఒక కుటుంబం నెల్లూరులో ప్రసిద్ధి చెందిన రొట్టెల పండుగను చూసేందుకు వచ్చారు. శనివారం సరదాగా గడిపేందుకు కుటుంబ సభ్యులతో కలిసి కోడూరు బీచ్‌కు వెళ్లారు. చిన్నారులు సముద్రపు అంచున ఆడుకుంటూ స్నానం చేస్తుండగా, ఒక్కసారిగా ముంచెత్తిన భారీ అల ముగ్గురినీ సముద్రం లోపలికి లాక్కెళ్లింది.

తీరంలో ఉన్న మత్స్యకారులు వెంటనే అప్రమత్తమై నీటిలోకి దూకి ఒక బాలికను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. కానీ, దురదృష్టవశాత్తూ సుఫియాన్ (4) అనే చిన్నారి ఈ ఘటనలో మరణించాడు. సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ యంత్రాంగం తక్షణమే ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గల్లంతైన మరో బాలిక ఆచూకీ కోసం గజ ఈతగాళ్లతో సముద్రంలో ముమ్మరంగా వెతుకుతున్నారు. ప్రాణాలతో బయటపడిన బాలికకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. పండుగ సంబరాల్లో ఉండాల్సిన కుటుంబంలో ఈ ప్రమాదం తీరని శోకాన్ని నింపింది.

Read hindi news : hindi.vaartha.com

అమరావతిపై వైసీపీ కక్షగట్టి వ్యవహరిస్తోంది: మంత్రి నాదెండ్ల మనోహర్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha