Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నెల్లూరులో బ్యాటరీ దొంగల ముఠా గుట్టురట్టు

నెల్లూరులో బ్యాటరీ దొంగల ముఠా గుట్టురట్టు

వార్త 3 months ago

ముగ్గురు అరెస్ట్, రూ. 1.45 లక్షల సొత్తు స్వాధీనం

Nellore Crime: నగరంలోని ఆటోనగర్ ప్రాంతంలో వరుసగా లారీ బ్యాటరీల దొంగతనాలకు పాల్పడుతూ లారీ యజమానులను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న ముఠాను వేదాయపాలెం పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు.

ముగ్గురు నిందితులను అరెస్ట్ చేయడంతో పాటు, వారి వద్ద నుంచి భారీగా చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన వివరాలను శుక్రవారం సాయంత్రం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నగర ఏఎస్పీ దీక్ష వెల్లడించారు.

Read Also:Rain Update : ఏపీలో నాల్గు రోజులపాటు వర్షాలు - APSDMA

Nellore Crime: అసలేం జరిగిందంటే..!

​గత కొంతకాలంగా వేదాయపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆటోనగర్‌లో రిపేర్ కోసం నిలిపి ఉంచిన లారీల నుండి బ్యాటరీలను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్తున్నారు. ఈ దొంగతనాలపై ఫిర్యాదులు రావడంతో జిల్లా ఎస్పీ డా. అజిత వెజెండ్ల ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) సిహెచ్ సౌజన్య, టౌన్ ఏఎస్పీ దీక్షల పర్యవేక్షణలో ​వేదాయపాలెం ఇన్‌స్పెక్టర్ కె. శ్రీనివాసరావు, ఎస్సై యు. సాయి కళ్యాణ్ ఇతర సిబ్బంది ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో చంద్రబాబు నగర్ మెయిన్ రోడ్డు వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది.

 Lorry Battery Thieves Arrested

నిందితులు చింతగుంట వెంకటేశ్వర్లు (19), పారి నరసింహులు (21), ఇలగనూరు శ్రీనివాసులు (24) అని గుర్తించారు.నిందితులు ముగ్గురూ చెడు వ్యసనాలకు బానిసై, జల్సాల కోసం సులభంగా డబ్బు సంపాదించాలని దొంగతనాల బాట పట్టారు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు వీరు ఒక హ్యుందాయ్ ఐ20 కారును దొంగతనాల కోసం ఉపయోగించడం గమనార్హం.పోలీసులు నిందితుల నుంచి14 లారీ బ్యాటరీలు,ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. ​వీటి మొత్తం విలువ సుమారు రూ. 1,45,000/- ఉంటుందని తెలిపారు. ​కేసును అత్యంత వేగంగా ఛేదించిన వేదాయపాలెం పోలీసు బృందాన్ని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. ప్రతిభ కనబరిచిన అధికారులకు, సిబ్బందికి రివార్డులు అందజేశారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

చారిత్రాత్మక దేవాలయాలపై పాక్ ఉగ్రదాడులకు కుట్రలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha