Terror Attack Plot: పాకిస్థాన్ ఒకవైపు ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నా ఇంకా బుద్ధిరావడం లేదు. ఆపరేషన్ సింధూర్ యుద్ధంలో ఘోరపరాజయం పొంది, ఆర్థికంగా దివాల తీసినా ఇంకా జ్ఞానోదయం కావడం లేదు.
తన దేశంలో ఉగ్రవాదాన్ని పెంచి, పోషిస్తూ ప్రపంచదేశాల ముందు అపరాధిగా ముద్ర పడ్డా కూడా ఆ దేశ పాలకులకు కనువిప్పు కలగడం లేదు. తాజాగా భారతదేశంలోని చారిత్రాత్మక ఢిల్లీ దేవాలయం, ముర్థల్ ధాబా లక్ష్యంగా దాడుల యత్నాన్ని పోలీసులు చేధించారు.
Read also: Tamil Nadu: మ్యాజిక్ ఫిగర్ సాధించిన TVK.. ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్!
Security alert at Indian temples.
Terror Attack Plot: దేవాలయాలే లక్ష్యంగా ఉగ్రవాదుల రెక్కీ
ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ అరెస్టు చేసిన నిందితుల విచారణలో పలు విస్తూపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి. పాకిస్థాన్ మద్దతు ఉన్న ఈ మాడ్యూల్ ప్రధాన లక్ష్యాలలో ఢిల్లీలోని ఒక చారిత్రక ఆలయం కూడా ఉందని దర్యాప్తు అధికారులు వెల్లడించారు. పోలీసుల విచారణలో నిందితులలో ఒకరు ఆ ఆలయం వద్ద రెక్కీ నిర్వహించి, అక్కడి ఫొటోలను పాకిస్థాన్ లోని సోషల్ మీడియా హ్యాండ్లర్లతో పంచుకున్నారు. ఈ ఉగ్రవాద కుట్రలో, ఆలయాన్ని లక్ష్యంగా చేసుకునే ముందు, అక్కడ మోహరించిన పోలీసులు, పారామిలిటరీ సిబ్బందిపై కాల్పులు జరిపేందుకు ప్రణాళికలు రచించినట్లు ఆరోపలు ఉన్నాయి.
హర్యానాలోని ప్రసిద్ధ ధాబా కూడా లక్ష్యం
ఢిల్లీ-సోనిపత్ హైవేపై ఉన్న ఒక ప్రముఖ ధాబా కూడా లక్ష్యాల జాబితాలో ఉందని పోలీసు వర్గాలు వెల్లడించాయి. ప్రతిరోజూ వేలాదిమంది సందర్శకులను ఆకర్షించే ఈ భోజనశాలపై, భారీ విధ్వంసం, భయాందోళనలు సృష్టించే ఉద్దేశ్యంతో హ్యాండ్ గ్రెనేడ్లతో దాడి చేయాలని భావించినట్లు ఆరోపణలు ఉన్నాయి. హర్యానాలోని సోనిపత్ జిల్లాలో ఉన్న ముర్థాల్, ఢిల్లీ నుండి పంజాబ్ లోని అమృత్ సర్ వరకు విస్తరించి ఉన్న జాతీయ రహదారి-44పై ఉన్న ప్రముఖ ధాబాలకు కేంద్రంగా ఉంది. ఈ భోజనశాలలను ప్రతిరోజూ 24 గంటలూ వేలాదిమంది సందర్శిస్తుంటారు. హిసార్ లోని ఒక సైనిక శిబిరం కూడా ఐఎస్ ఐ
అనుబంధ ముఠా నిఘాలో ఉన్నట్లు సమాచారం.
హైదరాబాద్ డాక్టర్ పాత్రపై NIA దర్యాప్తు
ఈ శిబిరం రెక్కీ వీడియోలను పాకిస్థాన్ నుంచి పనిచేస్తున్న హ్యాండ్లర్లకు పంపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులు, హైదరాబాద్ కు చెందిన డాక్టర్ సయ్యద్ అహ్మద్ మొహియుద్దీన్, ఉత్తరప్రదేశ్కు చెందిన ఆజాద్, మహమ్మద్ సుహెల్ లపై గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఉన్న ప్రత్యేక ఎన్ఐఏ కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఎన్ ఐఏ ప్రకారం, ఈ ముగ్గురూ విదేశాలలో ఉన్న ఐసిస్ హ్యాండ్లర్ల మార్గదర్శకత్వంలో పనిచేస్తూ, నిషేధిత ఆయుధాలు, జీవ ఉగ్రవాదాన్ని ఉపయోగించి జిహాద్ కు మద్దతు ఇవ్వడానికి, భయోత్పాతం సృష్టించేందుకు యత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

