Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నెల్లూరులో 'యోగాంధ్ర-2026' శంఖారావం!

నెల్లూరులో 'యోగాంధ్ర-2026' శంఖారావం!

వార్త 1 week ago

Nellore Yogandhra Programme 2026: నిత్య జీవితంలో యోగా సాధన చేయడం ద్వారా సంపూర్ణ శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత సాధ్యమవుతుందని చాటి చెబుతూ నెల్లూరు నగరంలో నిర్వహించిన సామూహిక యోగా ప్రదర్శనకు ప్రజల నుండి విశేష స్పందన లభించింది.

అంతర్జాతీయ యోగా దినోత్సవ (International Yoga Day) ముందస్తు వేడుకల్లో భాగంగా.. ఆదివారం ఉదయం నెల్లూరు స్వర్ణాల చెరువు ట్యాంక్‌బండ్ ఇరుగాలమ్మ అమ్మవారి ఆలయ సమీపంలో 'యోగాంధ్ర-2026' (Yogandhra-2026) ప్రత్యేక సామూహిక యోగా కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ (JC) మొగిలి వెంకటేశ్వర్లు జ్యోతి ప్రజ్వలన చేసి అధికారికంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా చల్లటి ఉదయపు వాతావరణంలో వందలాది మంది యోగాభ్యాసకులు, సాధారణ ప్రజలతో కలిసి జాయింట్ కలెక్టర్‌తో పాటు వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు స్వర్ణాల చెరువు ట్యాంక్‌బండ్‌పై ఆసీనులై విభిన్న యోగాసనాలను స్వయంగా ఆచరించారు. దీంతో స్వర్ణాల చెరువు పరిసర ప్రాంతమంతా యోగ సాధకులతో, శ్వేత వస్త్రధారులతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.

Read Also: ICF Sewing Machines Distribution:పరిటాల సునీత ఉదారత.. ఒంటరి మహిళలకు ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ!

మనసును, శరీరాన్ని అనుసంధానించే శక్తి యోగాకు ఉంది: జేసీ

యోగా ప్రదర్శన అనంతరం జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ప్రాచీన భారతదేశం విశ్వానికి అందించిన అత్యంత అమూల్యమైన, గొప్ప వరం యోగా విద్య అని కొనియాడారు. నిరంతరం చంచలంగా మారే మనుషుల మనసును కట్టుదిట్టమైన ఏకాగ్రతతో శరీరంతో అనుసంధానించే ఏకైక ప్రక్రియ యోగా మాత్రమేనని స్పష్టం చేశారు. మనిషి శరీరం, మనసు ఒకే లక్ష్యంపై కేంద్రీకృతమైనప్పుడు జీవితంలో అద్భుతమైన విజయాలను సాధించవచ్చని యువతకు దిశానిర్దేశం చేశారు.

ప్రజల నిత్య దినచర్యలో యోగాను ఒక అంతర్భాగంగా మార్చడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ 'యోగాంధ్ర' కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా డిజైన్ చేసిందని, దీనిని జిల్లాలోని నలుమూలలకు విస్తరించేందుకు ప్రతీ ఒక్కరూ భాగస్వాములు కావాలని జేసీ పిలుపునిచ్చారు. నిత్యం యోగాసనాలు, ప్రాణాయామం చేయడం ద్వారా ఒత్తిడితో కూడిన ఆధునిక లైఫ్ స్టైల్ వ్యాధులకు, అనారోగ్యాలకు దూరంగా ఉండి సంపూర్ణ ఆరోగ్యాన్ని ఉచితంగా పొందవచ్చని పేర్కొన్నారు.

Nellore Yogandhra Programme 2026: జూన్ 21న ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో మెగా యోగా..

జిల్లాలో జరగబోయే రాబోయే యోగాంధ్ర-2026 పూర్తి షెడ్యూల్ వివరాలను జేసీ ఈ సందర్భంగా ప్రకటించారు. జూన్ 8న ప్రసిద్ధ రామతీర్థం బీచ్ వద్ద, జూన్ 12న నగరంలోని వివిధ రెసిడెన్షియల్ అసోసియేషన్లు, స్వచ్ఛంద సంస్థల (NGOs) భాగస్వామ్యంతో థీమాటిక్ యోగా, జూన్ 16న తిరిగి రామతీర్థం బీచ్‌లో, జూన్ 17న స్వర్ణాల చెరువు వద్ద ప్రత్యేక పర్యాటక (Tourism Yoga) యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో అత్యంత భారీ స్థాయిలో సామూహిక మెగా యోగా ఈవెంట్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

ప్రముఖ యోగా గురువులు ముత్యాల రవీంద్ర, సలీనా ల ప్రత్యక్ష పర్యవేక్షణలో ప్రోటోకాల్ ప్రకారం యోగాభ్యాసకులు ఆసనాలు వేశారు. ఈ నగర స్థాయి యోగా సాధనలో నోడల్ అధికారి, ఐటీడీఏ పీఓ శ్రీనివాసరావు, ఆయుష్ (AYUSH) నోడల్ అధికారి డాక్టర్ శ్రీనివాసరాజు, మున్సిపల్ కార్పొరేషన్ డీడీ మాధురి, మెప్మా పీడీ కిరణ్ కుమార్, డీఆర్‌డీఏ పీడీ నాగరాజకుమారి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (DM&HO) డాక్టర్ సుజాత తదితర జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read also Epaper: epaper.vaartha.com

Read also:

రేపు పశ్చిమ గోదావరి జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha