Konda Surekha:నేను తప్పు చేయలేదు -నా వివరణ కోరలేదు : కొండా సురేఖ, తనను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయడాన్ని కొండా సురేఖ తీవ్రంగా ఖండించారు. తాను ఏ తప్పూ చేయలేదని, అందువల్ల తనకు ఎలాంటి పశ్చాత్తాపం లేదని స్పష్టం చేశారు.
మంత్రివర్గం నుంచి తొలగించే ముందు కనీసం తన వివరణ కూడా తీసుకోకపోవడం సరికాదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కుమార్తె వ్యాఖ్యలకు నన్ను ఎలా బాధ్యురాలిని చేస్తారు? తన కుమార్తె ఒక స్వతంత్ర మహిళ అని, ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగత అభిప్రాయాలని సురేఖ పేర్కొన్నారు. కుమార్తె చేసిన వ్యాఖ్యలకు తనను బాధ్యురాలిని చేయడం తగదని, ఆ వ్యాఖ్యలను ఖండించాల్సిన అవసరం తనకు లేదని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి ఆత్మపరిశీలన చేసుకోవాలి వైఎస్ రాజశేఖరరెడ్డి తర్వాత తాను రేవంత్ రెడ్డినే ఎక్కువగా అభిమానించానని, ఆయన పీసీసీ అధ్యక్షుడు మరియు ముఖ్యమంత్రి కావాలని కోరుకున్న మొదటి వ్యక్తుల్లో తాను ఉన్నానని తెలిపారు.
Read also: Kukatpally plots: కేపీహెచ్‌బీ ప్లాట్ల వేలంలో పెరిగిన పోటీ ధరలు
Konda Surekha’s cabinet dismissed
Konda Surekha:రేవంత్ రెడ్డి ఆత్మపరిశీలన చేసుకోవాలి
తనపై కక్షపూరితంగానే ఈ చర్యలు తీసుకున్నారని ఆరోపిస్తూ, సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయంలో ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. జగ్గారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలపై అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకుందో అని నిలదీశారు. ముగ్గురు బీసీ మహిళలకు పదవులు రావడం సంతోషం తనపై వేటు వేయడం ద్వారా ముగ్గురు బీసీ మహిళలకు మంత్రివర్గంలో పదవులు దక్కడం తనకు సంతోషాన్ని కలిగిస్తోందని వ్యాఖ్యానించారు. అదే సమయంలో తన కారణంగా చిన్నారెడ్డిపై చర్యలు తీసుకోవడం సరికాదని అభిప్రాయపడ్డారు. భవిష్యత్ కార్యాచరణపై ఇంకా ఏమీ నిర్ణయించుకోలేదని, అధిష్ఠానానికి ఇచ్చిన లేఖను మీడియాకు విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.
Epaper: epaper.vaartha.com

