Konda Surekha: తెలంగాణ మంత్రివర్గం నుంచి తనను తొలగించడంపై కొండా సురేఖ తీవ్రంగా స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డిపై ఆమె సంచలన ఆరోపణలు చేశారు. తనను మంత్రి పదవి నుంచి తొలగించకపోతే తానే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధిష్ఠానాన్ని బెదిరించారని సురేఖ ఆరోపించారు.
ఈ క్రమంలో రేవంత్ బ్లాక్‌మెయిల్ రాజకీయాలకు పాల్పడ్డారని విమర్శించారు. రాజ్‌భవన్ నుంచి అధికారిక ప్రకటన వెలువడకముందే ఇంటర్వ్యూలో తనను మంత్రివర్గం నుంచి తొలగించినట్లు సురేఖ వెల్లడించారు.
తనను మంత్రి పదవి నుంచి తొలగించే ముందు అధిష్ఠానం లేదా ముఖ్యమంత్రి కనీసం ఒక్క మాట కూడా చెప్పలేదని సురేఖ ఆవేదన వ్యక్తం చేశారు. తన నుంచి ఎలాంటి వివరణ తీసుకోలేదని, అలాగే రాజీనామా చేయాలని కూడా ఎవరూ అధికారికంగా కోరలేదని తెలిపారు. నిర్ణయం తీసుకునే ముందు తనతో మాట్లాడి అభిప్రాయం తీసుకుని ఉంటే బాగుండేదని వ్యాఖ్యానించారు.
Read Also : Konda Surekha comments: నా ఉసురు తాకుతుంది.. కొండా సురేఖ సంచలనం
Konda Surekha makes sensational comments on her dismissal.
Konda Surekha: నాపై కుట్ర చేశారు.. కొండా సురేఖ
తనపై వేం నరేందర్‌రెడ్డి, తిరుపతి రెడ్డి, కొండల్‌రెడ్డి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి కుట్ర పన్నారని సురేఖ ఆరోపించారు. తన కుమార్తె కొండా సుస్మిత మాట్లాడిన మాటలను పొంగులేటి సుధాకర్‌రెడ్డి రాజకీయంగా వాడుకున్నారని విమర్శించారు. సుస్మిత స్వతంత్ర భావాలు కలిగిన వ్యక్తి అని, ఆమె అభిప్రాయాలను తాము ఖండించాల్సిన అవసరం లేదని, ఆమెతో తాము ఏదీ మాట్లాడించలేదని స్పష్టం చేశారు.
రాజకీయాల్లో రేవంత్‌రెడ్డిని ఎంతోమంది విమర్శిస్తున్నారని, కానీ తన విషయంలోనే ఎందుకు ఇంత తీవ్రంగా స్పందించారో సీఎం ఆత్మపరిశీలన చేసుకోవాలని సురేఖ హితవు పలికారు. గతంలో రేవంత్ పిసిసి అధ్యక్షుడు కావాలని కోరుకున్న తొలి వ్యక్తులలో తాము ఉన్నామని, వైఎస్ రాజశేఖరరెడ్డి తర్వాత తాను ఎక్కువగా అభిమానించింది రేవంత్‌రెడ్డినేనని గుర్తుచేశారు.
పార్టీ మారే ఆలోచన లేదు
ప్రస్తుతానికి పార్టీ మారే ఆలోచన లేదని సురేఖ స్పష్టం చేశారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలపై తమకు ఎప్పటికీ అభిమానం ఉంటుందన్నారు. 2018లో కూడా ఇదే “దుష్టశక్తులు” తనకు కాంగ్రెస్ టికెట్ రాకుండా అడ్డుకున్నాయని, అందుకే అప్పట్లో బీఆర్‌ఎస్‌లోకి వెళ్లాల్సి వచ్చిందని వివరించారు. ఈ పరిణామాలన్నింటినీ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్‌కు వివరించినట్లు తెలిపారు.

