Nepal Floods : నేపాల్‌లోని త్రిశూలీ 3ఏ హైడ్రోపవర్ టన్నెల్ నుండి ఇద్దరు కార్మికులను ఆర్మీ సురక్షితంగా బయటకు తీసిన నేపథ్యంలో అంతర్జాతీయ టన్నెలింగ్ నిపుణుడు అర్నాల్డ్ డిక్స్ రెస్క్యూ చర్యలకు మార్గదర్శకత్వం వహిస్తున్నారు.
ఆగస్టు 26న వచ్చిన వినాశకరమైన వరదల కారణంగా భోటేకోసి నది పరివాహక ప్రాంతంలో ఉన్న దాదాపు 12 జలవిద్యుత్ కేంద్రాలు భూగర్భంలో కలిసిపోయాయి. కొండచరియలు విరిగిపడటంతో సొరంగాల ప్రవేశ ద్వారాలు పూర్తిగా కూలిపోయి, సుమారు 900 మంది కార్మికులు లోపల చిక్కుకుపోయినట్లు ప్రభుత్వం తెలిపింది. ఉపగ్రహ డేటా ఆధారంగా ఎంట్రెన్స్ ప్రాంతాన్ని పసిగట్టి, కార్ల కంటే పెద్దగా ఉన్న బండరాళ్లను డైనమైట్లతో పేల్చుతూ రెస్క్యూ సిబ్బంది ముందుకు సాగుతున్నారు.
Nepal Floods
Nepal Floods : ‘గోల్డీలాక్స్ జోన్’పై చిగురిస్తున్న ఆశలు
త్రిశూలీ టన్నెల్‌లో ఇప్పటివరకు 60 మీటర్ల మేర శోధన పూర్తి కాగా, మరో 150 మీటర్ల దూరం సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాల్సి ఉంది. హైడ్రోపవర్ స్టేషన్లలో కొంత ఎత్తులో ఉండే ‘గోల్డీలాక్స్ జోన్’లో గాలి, ఖాళీ స్థలం లభించే అవకాశం ఉండటంతో, మిగిలిన కార్మికులు అక్కడే సజీవంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అర్నాల్డ్ డిక్స్ వెల్లడించారు. నేపాల్, టిబెట్ వరదల్లో మృతుల సంఖ్య 1,301కి చేరగా, ఇంకా 5,339 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది.
నేపాల్‌కు సోనూసూద్ సాయం.. పబ్లిసిటీ అంటూ ట్రోల్స్: సోనూ సూద్ హుందైన రిప్లై

