TG Traffic Rules Awareness: సమాజంలో జరుగుతున్న నేరాల కంటే రహదారి ప్రమాదాల వలన ఎక్కువమంది ప్రాణాలు కోల్పోతున్నారని హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, డిజి శిఖాగోయల్ ఆవేదన వ్యక్తం చేశారు.
పోలీసుశాఖ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కేంద్రంలోని పోలీసు కన్వెన్షన్ సెంటర్లో ‘అరైవ్, అలైవ్’ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన రహదారి భద్రత అవ గాహన సదస్సులో ఆమె పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో యేడాదికి సగటున 800 హత్యలు జరుగుతుంటే.. 8 వేల మంది రోడ్డు ప్రమా దాల్లో ప్రాణాలు కోల్పోతున్నారని ఇందులో అత్య ధిక ప్రమాదాలు గ్రామీణ ప్రాంతాల రోడ్లపైనే జరుగుతున్నాయన్నారు.
More lives are lost due to accidents than to crimes.
TG Traffic Rules Awareness: రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణాలు
అతివేగం, మద్యం మత్తులో వాహనాలు నడ పడం వలన వారి ప్రాణాలకే కాకుండా ఎదుటివారి ప్రాణాలకు సైతం ముప్పు తెస్తున్నారని వాపోయారు. వాహనం నడుపుతూ సెల్ ఫోన్ మాట్లాడడం అత్యంత ప్రమాదకర మన్నారు. ప్రజ లు అడిగిన పలు ట్రాఫిక్ ఉల్లంఘనల ప్రశ్నలకు ఆమె సమా ధానాలిచ్చారు. జిల్లా కలెక్టర్ కె.హై మావతి మాట్లాడుతూ ప్రజాపాలన ప్రగతి ప్రణా ళిక కార్యక్ర మంలో ‘అరైవ్ అలైవ్ (రహదారి భద్రత) వారం రోజులు ముఖ్యమైన అంశంగా జరిగింద న్నారు.
అవగాహన కార్యక్రమాలు
సీపీ రష్మీ పెరుమాళ్ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణతోపాటు ప్రజల్లో సామా జిక అవగాహన కల్పించడం సైతం పోలీసుల బాధ్యత అన్నారు. అంతకుముందు రహదారి భద్రతపై అవగాహన విడియోలను ప్రదర్శించారు. కనువిప్పు బృందం ట్రాఫిక్ నిబంధనలు, రహదారి భద్రతా ప్రమాణాలు, ఉల్లంఘ నలపై ఆలపించిన చైతన్య గీతాలు ఆకట్టుకున్నాయి. కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభిం చారు. అర్హులైన లబ్ధిదా రులకు డిజి చేతుల మీదుగా ఉచిత కంటి అద్దాలు, మెడికల్ కిట్లు పంపిణీ చేశారు. అలాగే ద్విచక్ర వాహనదారులకు ఉచితంగా హెల్మెట్లను అందించారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

