Ramagundam NTPC: రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లా రామగుండంలో చేపట్టనున్న 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నిర్మాణాన్ని ఎన్టీపీసీకి అప్పచెప్పేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.
రామగుండంలో ఎన్టీపీసీ ఆధ్వర్యంలో ఉత్పత్తి అవుతున్న 2,600 మెగావాట్ల విద్యుత్ను డిమాండ్ లేక పూర్తి స్థాయిలో ఉత్పత్తి చేయ లేక పోతున్నది. అయితే ఈ 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన కొత్తగా ఏర్పాటు చేయనున్న ప్లాంట్ నిర్మాణ పనులను ఎన్టీపీసీ సంస్థకే అప్పగించాలనే నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నాలు ఆరంభించినట్లు సమాచారం. ఈ కొత్త ప్లాంట్ నిర్మాణానికి రూ.10,893 కోట్ల అవుతాయని అంచనా వేశారు.
Read Also : Mahabubnagar News: జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నా.. యెన్నం శ్రీనివాస్ రెడ్డి
New power project in Telangana… Ramagundam thermal responsibilities to NTPC?
Ramagundam NTPC: సింగరేణి ప్రతిపాదన తిరస్కరణ
మొదట ఈ ప్లాంట్ను సింగరేణి సంస్థ భాగస్వామ్యంతో నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. అయితే ఈ ప్రతిపాదనను తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి సంస్థ జెన్కో వ్యతిరేకించింది. దీంతో రామగుండం బీథర్మల్ కేంద్రాన్ని నిర్మించే బాధ్యతను ఎన్టీపీసీకి అప్పగించాలని ప్రభుత్వం భావిస్తున్నది. రాష్ట్ర విభజనలో భాగంగా తెలంగాణ రాష్ట్ర అవసరాల కోసం 4000 మెగావాట్ల సామర్థ్యంతో (800 మెగావాట్ల చొప్పున 5 యూనిట్లు) సూపర్ క్రిటికల్ థర్మల్ విద్యుత్ కేంద్రాలను ఎన్టీపీసీ ద్వారా రామగుండంలో నిర్మించాలని చట్టంలో పేర్కొన్న విషయం తెలిసిందే.
విభజన చట్టం హామీలు – ప్రస్తుత పరిస్థితి
ఆ మేరకు టీఎస్టీపీపీ కేంద్రాల నిర్మా ణాలను చేపట్టారు. గత ప్రభుత్వ హయాంలో 1600 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు కోసం పీపీఏ చేసు కోవడంతో 800 మెగావాట్ల సామర్థ్యం గల రెండు యూనిట్ల నిర్మా ణాన్ని ఎన్టీపీసీ చేపట్టి పూర్తి చేసింది. వాటి ద్వారా ఏడాదిన్నర కాలంగా విద్యుత్ ఉత్పత్తి అవుతున్నది. మిగిలిన 2,400 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కోసం ఇప్పటి వరకూ ఎటువంటి పీపీఏ కుదుర్చు కోలేదు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాలనుకుంటున్న రామగుండం బీథర్మల్ ప్రాజెక్టును ఎన్టీపీసీ చేపట్టే విధంగా ఒప్పించాలని ప్రయత్నం చేస్తున్నది. ఇందులో భాగంగానే ఇటీవల ఎన్టీపీసీ కార్పొరేట్ బృందం రామగుండం థర్మల్ స్థలాన్ని పరిశీలిం చారని సమాచారం.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

