Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నేరెళ్ల బాధితులకు క్షమాపణ చెప్పిన కవిత..బాధితులకు కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్

నేరెళ్ల బాధితులకు క్షమాపణ చెప్పిన కవిత..బాధితులకు కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్

వార్త 1 week ago

Kavitha: తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. 2017 సంవత్సరంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో సంచలనం సృష్టించిన 'నేరెళ్ల ఘటన'పై స్పందిస్తూ ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

ఆ దారుణ ఘటన పట్ల తాను సిగ్గుతో తలదించుకుంటున్నానని పేర్కొంటూ తెలంగాణ సమాజానికి బేషరతుగా బహిరంగ క్షమాపణలు తెలియజేశారు. బాధితులకు పూర్తిస్థాయిలో న్యాయం జరిగే వరకు తాను పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు.

గంధం గోపాల్ కుటుంబాన్ని పరామర్శించిన కవిత – రూ. కోటి పరిహారానికి డిమాండ్

నేరెళ్లలో ఇసుక మాఫియా అక్రమ రవాణాను ధైర్యంగా అడ్డుకున్నందుకు నాటి పోలీసుల దాడికి గురై తీవ్ర క్షతగాత్రుడైన బాధితుడు గంధం గోపాల్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఈ నేపథ్యంలో మంగళవారం నేరెళ్ల వెళ్లిన ఎమ్మెల్సీ కవిత.. మృతిచెందిన గంధం గోపాల్ కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇసుక మాఫియాపై పోరాడినందుకు నేరెళ్ల ప్రజలపై జరిగిన దౌర్జన్యం తెలంగాణ రాష్ట్రానికే మచ్చ అని, ఆనాడు పాలించిన కుటుంబ సభ్యురాలిగా ఈ ఘటనకు చింతిస్తూ క్షమాపణ కోరుతున్నానని భావోద్వేగంతో వ్యాఖ్యానించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే రూ. 1 కోటి ఎక్స్‌గ్రేషియా (పరిహారం) చెల్లించాలని డిమాండ్ చేశారు.

Kavitha: రేవంత్ రెడ్డి, కేటీఆర్, బండి సంజయ్‌లపై కవిత తీవ్ర ప్రశ్నలు

నేరెళ్ల ఘటన జరిగి ఏళ్లు గడుస్తున్నప్పటికీ, ఈ అమానుష కాండకు ప్రత్యక్షంగా కారకులైన పోలీసులు మరియు ఇతర బాధ్యులపై నేటికీ ఎందుకు కఠిన చర్యలు తీసుకోలేదని ఆమె ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్, బీఆర్ఎస్ నేత కేటీఆర్‌లను సూటిగా నిలదీశారు. కేవలం బాధితుల పేర్లు చెప్పుకుని ఓట్లు దండుకున్న రేవంత్ రెడ్డి.. అధికారంలోకి వచ్చాక వారిని పూర్తిగా విస్మరించారని తీవ్రస్థాయిలో విమర్శించారు.

ఎస్సీ కమిషన్ నివేదిక బహిర్గతం చేయాలి – లేదంటే సీఎంవో ముంద ధర్నా

బాధితులకు తక్షణ న్యాయం చేకూర్చే దిశగా ఎస్సీ కమిషన్ రూపొందించిన నివేదికను ప్రభుత్వం వెంటనే బహిర్గతం చేయాలని కవిత డిమాండ్ చేశారు. ఒకవేళ నివేదిక బయటపెట్టకపోతే సీఎంవో కార్యాలయం లేదా అసెంబ్లీ ఎదుట భారీ ధర్నాకు దిగుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ బాధితులకు అండగా నిలవాలని పిలుపునిచ్చిన ఆమె.. బీఆర్ఎస్ నేత కేటీఆర్ కూడా బాధ్యత వహించి గంధం గోపాల్ పిల్లల చదువుల పూర్తి ఖర్చును తానే భరించాలని విజ్ఞప్తి చేశారు.

లెక్చరర్ కొట్టారని.. అవమానం తట్టుకోలేక టాపర్ విద్యార్థి ఆత్మహత్య!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha