Raithana Meekosam : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా సాగు పనుల వేళ అన్నదాతలకు అండగా నిలిచేందుకు వ్యవసాయ శాఖ సరికొత్త కార్యాచరణతో ముందుకు వచ్చింది.
ఇందులో భాగంగానే నేటి నుంచి ఈ నెల 27 వరకు రాష్ట్రవ్యాప్తంగా 'రైతన్నా.. మీ కోసం' అనే బృహత్తర అవగాహన కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. కేవలం కార్యాలయాలకే పరిమితం కాకుండా, వ్యవసాయ శాఖ సిబ్బంది స్వయంగా రైతుల ఇళ్ల వద్దకే వెళ్లి పంటల సాగుపై కీలక సూచనలు చేయనున్నారు. ముఖ్యంగా ప్రస్తుత వ్యవసాయ సీజన్‌పై తీవ్ర ప్రభావం చూపే ఎల్నినినో (El Niño) పరిస్థితులు, వాటి వల్ల వచ్చే వర్షాభావ ముప్పును ఎలా తట్టుకోవాలి, ప్రత్యామ్నాయంగా ఎలాంటి తక్కువ నీటితో పండే పంటలను వేసుకోవాలనే విషయాలపై రైతులకు క్షేత్రస్థాయిలో పూర్తి అవగాహన కల్పిస్తారు. మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు నష్టపోకుండా ముందస్తుగా సిద్ధం చేయడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం.
Read Also : బసవతారకం ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు.. పాల్గొననున్న చంద్రబాబు

8,451 రైతు సేవా కేంద్రాల ద్వారా పంపిణీ.. డిజిటల్ సేవలపై ప్రత్యేక ఫోకస్
రాష్ట్రంలోని 666 మండలాల పరిధిలో విస్తరించి ఉన్న 8,451 రైతు సేవా కేంద్రాల (RSK) ద్వారా ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. దీని ద్వారా రాష్ట్రంలోని సుమారు 46.85 లక్షల మంది అన్నదాతలకు సాగుకు సంబంధించిన ముందస్తు ప్రణాళికలు, జాగ్రత్తలతో కూడిన ప్రత్యేక పాంప్లెట్లను సిబ్బంది నేరుగా పంపిణీ చేయనున్నారు. ఈ అవగాహన సదస్సుల్లో సాంకేతికత వాడకానికి ప్రభుత్వం పెద్దపీట వేసింది. APAIMS 2.0 (AP Agricultural Inputs Management System) యాప్/పోర్టల్ ద్వారా నకిలీల బారిన పడకుండా నాణ్యమైన ఎరువులను ఎలా కొనుగోలు చేయాలి, నేల స్వభావాన్ని బట్టి రసాయన ఎరువుల వాడకాన్ని ఎలా తగ్గించుకోవాలనే అంశాలపై రైతులకు లైవ్ డెమోల ద్వారా వివరించనున్నారు. ఈ డిజిటల్ పద్ధతుల వల్ల పెట్టుబడి ఖర్చులు తగ్గి, దిగుబడులు పెరిగే అవకాశం ఉండటంతో ఈ కార్యక్రమం ఏపీ వ్యవసాయ రంగంలో కీలక మైలురాయిగా నిలవనుంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

